వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్.. అక్టోబర్ 2న మెగా టోర్నీ షురూ! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో టోర్నీ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-ఎ లో తలపడనున్నాయి.

News18
News18

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పూర్తి మ్యాచ్‌ల వివరాలు ప్రకటించారు. ఈ మెగా టోర్నమెంట్ 2027 అక్టోబర్ 2న ప్రారంభమై నవంబర్ 21న జరిగే ఫైనల్ పోరుతో ముగియనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 12 జట్లు తలపడే ఈ మెగా సమరంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. లీగ్ దశలోనే దాయాదుల మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుండటంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా అర్హత సాధించే జట్లతో కలిపి పూర్తి షెడ్యూల్ ఖరారవుతుంది.

గ్రూప్-ఎ లో భారత్, ఆస్ట్రేలియా, పాక్

ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ లో భారత్‌తో పాటు ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఆతిథ్య జింబాబ్వే ఉన్నాయి. క్వాలిఫైయర్ ద్వారా మరో జట్టు ఈ గ్రూప్‌లో చేరుతుంది. గ్రూప్-బి లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ మరో క్వాలిఫైయర్ జట్టుతో తలపడనున్నాయి.

world cup 2027 schedule
సరికొత్తగా ‘సూపర్-7’ ఫార్మాట్

టోర్నీ ఫార్మాట్‌లో ఐసీసీ కీలక మార్పులు తీసుకొచ్చింది. గ్రూప్ దశ పూర్తయ్యాక అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఏడు జట్లు ‘సూపర్-7’ దశకు అర్హత సాధిస్తాయి. ఇక్కడ ప్రతి జట్టు మిగిలిన ఆరు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్ పోరుకు అర్హత పొందుతాయి.

నవంబర్ 21న జరిగే తుది పోరుతో కొత్త ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. గత ఎడిషన్‌లో స్వదేశంలో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా ఈసారి ఆఫ్రికా గడ్డపై ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. అటు కోట్లాది మంది అభిమానులు ఎదురుచూసే భారత్, పాక్ సమరం ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports