FlyDubai: ఫ్లైదుబాయ్ విమానంలో దాడి ఘటన.. కో-పైలట్ గురించి వెలుగులోకి సంచలన విషయాలు | | ACTPnews

ఫైల్ ఫోటో


Last Updated:

FlyDubai: టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమన్ కో-పైలట్‌ను 29 ఏళ్ల హమామ్ అల్-హమ్మామీగా గుర్తించారు.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

నిందితుడి గత చరిత్ర, అతని తీవ్రవాద భావజాలంపై విచారణ సంస్థలు దర్యాప్తు చేస్తుండగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్ అరేబియా కథనం ప్రకారం.. అల్-హమ్మామీ ఒమన్‌కు వెలుపల, ప్రధానంగా సిరియాలో ఎక్కువ కాలం గడిపాడు. అక్కడే అతను తీవ్రవాద భావజాలానికి ప్రభావితమైనట్లు తెలుస్తోంది. తీవ్రవాద ఆలోచనల కారణంగా ఒమన్ ప్రభుత్వం గతంలోనే అతడిని విమానాలు నడపకుండా నిషేధించింది. ఆ నిషేధం తర్వాత అతను ఒమన్ వదిలి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు వెళ్లి, అనంతరం ఫ్లైదుబాయ్‌లో చేరాడు.

తీవ్రవాద ప్రభావంపై దర్యాప్తు

ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 12 కథనం ప్రకారం.. హమ్మామీ అల్-ఖైదా భావజాలానికి ఆకర్షితుడైనట్లు, ఈ క్రమంలో పలువురు మత పెద్దలను కలిసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తీవ్రవాద సంస్థలతో అతడికి సంబంధాలున్నాయా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

విమానాన్ని ఇజ్రాయెల్‌లోనే కూల్చివేయాలని తాను భావించినట్లు నిందితుడు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థ i24NEWS పేర్కొంది. ఈ కుట్ర ఫలించి ఉంటే ‘9/11’ తరహా భారీ విషాదం జరిగి ఉండేదని వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, తీవ్రవాద వెబ్‌సైట్లను సందర్శించిన కారణంగా 2024లోనే అతడిపై ఆంక్షలు విధించారని ఫాక్స్ న్యూస్, ఒమన్ జాతీయ విమానయాన సంస్థలో ట్రైనింగ్ నుంచి తొలగించారని సీఎన్ఎన్ కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద నేపథ్యం ఉన్న వ్యక్తి యూఏఈలో కమర్షియల్ పైలట్‌గా ఎలా ఉద్యోగం పొందగలిగాడన్న అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

విమానంలో ఏం జరిగింది?

సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో.. అల్-హమ్మామీ కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై కత్తితో దాడి చేశాడు. దాంతో బోయింగ్ 737 విమానం ఒక్కసారిగా వేగంగా కిందకు దూసుకుపోయింది. గాయపడినప్పటికీ భారత పైలట్ చాకచక్యంగా కాక్‌పిట్ తలుపు తెరిచారు. వెంటనే ఇతర సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తమై కో-పైలట్‌ను అడ్డుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని అదుపులోకి తెచ్చి, సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అల్-హమ్మామీని యూఏఈకి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మీడియాలో పెద్దఎత్తున కథనాలు వస్తున్నప్పటికీ, నిందితుడి వివరాలు, గుర్తింపుపై యూఏఈ అధికారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed