TTD : టీటీడీలో కొత్త వివాదం.. బి.ఆర్. నాయుడుపై భూమన సంచలన ఆరోపణలు..! | | ACTPnews

News18


Last Updated:

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు, టీవీ5పై తప్పుడు ప్రచారం, రాజకీయ కక్ష ఆరోపణలు చేస్తూ, పెద్ద ఉద్యమం చేస్తానని హెచ్చరించారు

+

News18

తిరుపతి రాజకీయ, ధార్మిక వర్గాల్లో సంచలన చర్చకు దారితీసిన అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తనను లక్ష్యంగా పెట్టుకుని అనైతిక రాజకీయాలకు తెరలేపారని ఆరోపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. టీవీ5 సంస్థ తరఫున ఆ వ్యక్తికి ఫోన్ కాల్స్ వచ్చాయని చెబుతూ, తనతో పని చేసిన వారిని ఉపయోగించి తప్పుడు ప్రచారాలకు పాల్పడాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఇలాంటి చర్యలు రాజకీయ కక్షసాధింపులో భాగమని పేర్కొన్న భూమన.. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి పన్నిన కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బి.ఆర్. నాయుడు గతంలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు తెలుసని, ఇప్పుడు మాజీ ఉద్యోగులను వాడుకుని అసాంఘిక రాజకీయాలకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని తీవ్రస్థాయిలో విమర్శించారు. తన జీవితమంతా ప్రజా ఉద్యమాలు, సామాజిక పోరాటాలకే అంకితం చేశానని, ఎప్పుడూ ఎవరి వద్దా పైరవీలు చేసి పదవులు పొందలేదని స్పష్టం చేశారు.

ధన ఆశ చూపించి, భయపెట్టి తన వద్ద పనిచేసిన వారిని ప్రభావితం చేసి మీడియా ద్వారా తనపై తప్పుడు ప్రచారాలు చేయాలని చూస్తే తాను ఏమాత్రం భయపడబోనని భూమన హెచ్చరించారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, జరుగుతున్న కుట్రలను ప్రజల ముందుకు తీసుకువస్తానని స్పష్టం చేశారు. తనను బలహీనపరచేందుకు ఎంత ప్రయత్నించినా తాను అదిరేది లేదని, బెదిరేది లేదని ధీమా వ్యక్తం చేశారు.

టీటీడీ వంటి పవిత్రమైన ధార్మిక సంస్థకు చైర్మన్‌గా వ్యవహరించే వ్యక్తి వినయం, నీతి, విలువలతో ఉండాల్సిందిపోయి నీచ రాజకీయాలకు పాల్పడటం అత్యంత బాధాకరమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధార్మిక సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం నైతికంగానే కాక చట్టపరంగానూ తప్పేనని వ్యాఖ్యానించారు. ఇకపై బి.ఆర్. నాయుడు వ్యవహారాలపై మరింత పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తానని హెచ్చరించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports