Singeetham Srinivasa Rao: సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్, వైజయంతి మూవీస్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

ఎన్టీఆర్, సింగీతం


Last Updated:

దిగ్గజ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణంపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా ఆయన కుటుంబానికి సంతాపం తెలిపింది.

ఎన్టీఆర్, సింగీతం
ఎన్టీఆర్, సింగీతం

Singeetham Srinivasa Rao: భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణ ప్రయోగాలకు, అద్భుత దృశ్యకావ్యాలకు చిరునామాగా నిలిచిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరన్న వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, చిత్ర నిర్మాణ సంస్థలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

“సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి వంటి చిత్రాలతో కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలను అందించిన గొప్ప దార్శనికుడు ఆయన. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఓం శాంతి” అంటూ ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్ చేశారు.

మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సైతం సింగీతం శ్రీనివాసరావు మృతికి ప్రగాఢ నివాళులర్పించింది. “మేము మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాము, యావత్ ప్రపంచం మిమ్మల్ని మిస్ అవుతుంది. మా హృదయాల్లో మీరు ఎప్పటికీ నిలిచి ఉంటారు సింగీతం శ్రీనివాసరావు గారు” అంటూ ఎమోషనల్ పోస్ట్ ద్వారా ఆయన సేవలను స్మరించుకుంది. సినిమా రంగంలో సైన్స్ ఫిక్షన్, మూకీ చిత్రాలు, బయోపిక్‌లు వంటి విభిన్న తరహా ప్రయోగాలు చేసి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సింగీతం మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటని సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed