Last Updated:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కలిసి యాంకర్ సుమతో ప్రత్యేకంగా చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో విజయ్, రష్మిక మధ్య ఉన్న బాండింగ్ మరోసారి హైలైట్ అయింది.
చిట్‌చాట్‌లో భాగంగా యాంకర్ సుమ.. విజయ్ దేవరకొండను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. ‘మీ పెళ్లై ఎన్ని రోజులైంది?’ అని ప్రశ్నించగా.. విజయ్ కాస్త ఆలోచించి 7, 8 నెలలు అయ్యుండొచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈ ప్రశ్నకు సంబంధించిన సరదా సంభాషణ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. విజయ్, రష్మిక గురించి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్న సమయంలో ఈ ఇంటర్వ్యూలోని మరిన్ని విషయాలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇదే ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండను ఒక్క మాటలో వర్ణించమని సుమ.. రష్మికను అడిగింది. దీనికి రష్మిక ఏమాత్రం ఆలోచించకుండా ‘లవ్’ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ అంటే తనకు ఎంత ఇష్టమో రష్మిక ఒక్క మాటలోనే చెప్పేసిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో విజయ్ను కూడా రష్మికను ఒక్క మాటలో డిస్క్రైబ్ చేయమని అడగగా.. ‘మై కామ్’ అంటూ చెప్పాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి కనిపించడంతో అభిమానులు ఈ వీడియోపై ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంటర్వ్యూలో అత్యంత ఆసక్తికరంగా మారిన మరో విషయం విజయ్ దేవరకొండను రష్మిక ఇమిటేట్ చేయడం. ఇంట్లో విజయ్ ఎలా ఉంటాడో సుమ అడగడంతో.. రష్మిక అతడి స్టైల్‌ను తనదైన శైలిలో అనుకరించింది. విజయ్ కింద హాల్లోకి వచ్చి ఫుడ్ ఏంటి అని అడుగుతాడని రష్మిక చెప్పింది. అంతేకాదు.. తాను ‘బేబీ.. బేబీ’ అని పిలిచినా విజయ్ వెంటనే స్పందించడని, కానీ ‘ఒరేయ్’ అని పిలిస్తే మాత్రం వెంటనే పలుకుతాడని సరదాగా చెప్పుకొచ్చింది. దీనిపై విజయ్ ఫ్యాన్స్ కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొగుడ్ని పట్టుకుని ఏంటా మాటలు రష్మిక అక్క.. ఎలా భరిస్తున్నావ్ విజయ్ బేబి అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
రష్మిక విజయ్ను ఇమిటేట్ చేసిన తీరు అక్కడ నవ్వులు పూయించింది. ముఖ్యంగా విజయ్ ఎలా స్పందిస్తాడో, ఏ విధంగా మాట్లాడుతాడో రష్మిక అనుకరించడంతో ఈ ఇంటర్వ్యూ మరింత సరదాగా మారింది. ప్రస్తుతం ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ‘రణబాలి’ ప్రమోషన్లలో భాగంగా విజయ్, రష్మిక కలిసి చేసిన ఈ స్పెషల్ చిట్‌చాట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. వీరిద్దరి కెమిస్ట్రీ, సరదా సంభాషణలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్ 16న ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.














