Makuta Developers: ప్రతిభ చూపిన 5 మంది విద్యార్థులకు రూ.5 లక్షల రివార్డ్.. SJGC వార్షిక సమావేశంలో అదిరిపోయే గిఫ్ట్..! student encouragement. | | ACTPnews

News18


Last Updated:

మకుట డెవలపర్స్ చైర్మన్ జనార్ధన్ కొంపల్లి SJGC వార్షిక సమావేశంలో ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందించారు.

News18
News18

ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు మకుట డెవలపర్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ జనార్ధన్ కొంపల్లి ముందుకొచ్చారు. సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ (SJGC), కర్నూలు ఫ్రాటర్నిటీ వార్షిక సమావేశం సందర్భంగా ఐదుగురు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏకంగా రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందించారు. ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున అందజేసి వారి ప్రతిభను గుర్తించారు.

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ఆదివారం జరిగిన SJGC ఫ్రాటర్నిటీ వార్షిక సమావేశానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, ఫ్రాటర్నిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యాసంస్థతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. కాలేజీ అందించిన అవకాశాలు, అక్కడి నుంచి ప్రారంభమైన తమ ప్రయాణాన్ని పలువురు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించారు. వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు మకుట డెవలపర్స్ చైర్మన్ జనార్ధన్ కొంపల్లి కీ స్పాన్సర్, ప్యాట్రన్‌గా రూ.5 లక్షల మొత్తాన్ని అందించారు. ఐదుగురికి చెరో రూ.లక్ష చొప్పున ఈ ప్రోత్సాహకాన్ని అందజేశారు. విద్యార్థుల విజయాలను కేవలం అభినందించడమే కాకుండా.. వారి భవిష్యత్ లక్ష్యాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునేలా చేయొచ్చని జనార్ధన్ కొంపల్లి పేర్కొన్నారు. SJGC ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. తమకు విద్యనందించిన సంస్థకు తిరిగి ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే.. తదుపరి తరం కూడా మరింత ఉన్నతంగా ఆలోచించే అవకాశం ఉంటుందని అన్నారు.

SJGCతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్న పూర్వ విద్యార్థులంతా ఈ వార్షిక సమావేశంలో ఒకచోట చేరారు. పాత మిత్రులను కలుసుకోవడంతో పాటు.. కాలేజీ రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన పలువురు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. విద్యాసంస్థ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణంలో పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.

ఇక మకుట డెవలపర్స్ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవంతో దక్షిణ భారతదేశంలో వాణిజ్య, నివాస, పారిశ్రామిక ప్రాజెక్టులను చేపడుతోంది. నాణ్యత, డిజైన్, కస్టమర్ సంతృప్తికి ప్రాధాన్యం ఇస్తూ ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంపై సంస్థ దృష్టి సారిస్తోంది. 2006లో ప్రారంభమైన సంస్థ.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అనుభవం ఉన్న జనార్ధన్ కొంపల్లి మార్గదర్శకత్వంలో విస్తరించింది. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ద్వారా సంస్థ సామాజిక బాధ్యతలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed