IND vs WI: మంగళవారం నుంచే విండీస్‌‌తో టీ20 సమరం.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇదే! | క్రీడా వార్తలు | ACTPnews

IND vs WI: మంగళవారం నుంచే విండీస్‌‌తో టీ20 సమరం.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇదే! | క్రీడా వార్తలు


వెస్టిండీస్ వన్డే జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు టీ20 జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ షాయ్ హోప్ గువాహటి, న్యూ చండీగఢ్ వేదికల్లో వరుస సెంచరీలు బాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడితో పాటు ఐపీఎల్‌లో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన అనుభవం ఉన్న షిమ్రాన్ హెట్మయర్, రోవ్‌మన్ పావెల్, అకీల్ హొసేన్, రొమారియో షెపర్డ్ జట్టులోకి చేరడంతో కరీబియన్ సేన మరింత ప్రమాదకరంగా మారింది.

భారత జట్టు విషయానికి వస్తే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్‌లకు విశ్రాంతినిచ్చారు. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పేస్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కీలకం కానున్నారు.

భారత జట్టు వివరాలు

వన్డే జట్టు నుంచి టీ20ల్లో ఆడుతున్న ఆటగాళ్లు: నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి.

టీ20 జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

భారత పూర్తి టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్.

వన్డే సిరీస్ ముగిసి ఇంటికి వెళ్లిన ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

వెస్టిండీస్ జట్టు వివరాలు

వన్డే జట్టు నుంచి టీ20ల్లో ఆడుతున్న ఆటగాళ్లు: షాయ్ హోప్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, షామర్ జోసెఫ్, గుడాకేష్ మోతీ, కీమో పాల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్.

టీ20 జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లు: జ్యువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మయర్, అకీల్ హొసేన్, కామిల్ పూరన్, రోవ్‌మన్ పావెల్, క్వెంటిన్ సాంప్సన్, రొమారియో షెపర్డ్, షామర్ స్ప్రింగర్.

వెస్టిండీస్ పూర్తి టీ20 జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రాన్ హెట్మయర్, అకీల్ హొసేన్, షామర్ జోసెఫ్, గుడాకేష్ మోతీ, కీమో పాల్, కామిల్ పూరన్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, రొమారియో షెపర్డ్, షామర్ స్ప్రింగర్.

వన్డే సిరీస్ ముగిసి తిరుగుముఖం పట్టిన ఆటగాళ్లు: జాన్ క్యాంప్‌బెల్, కేసీ కార్టీ, అమీర్ జాంగూ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, విటెల్ లావ్స్, జస్టిన్ గ్రీవ్స్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed