ఈ చిత్రంలో కార్తీతో పాటు ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రాజిషా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సర్దార్ ఫ్రాంచైజ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన కార్తీ ఈ సినిమాలో మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఒక పాత్రలో స్పై ఏజెంట్ సర్దార్‌గా, మరో పాత్రలో ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాశ్‌గా నటించారు. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం ‘సర్దార్ 2’కు కొత్త ఆడియన్స్ లభిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమాకు మంచి స్పందన వస్తోందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.














