Vidyut Jammwal: 15 నిమిషాల పాటు కదలకుండా ధ్యానం.. నటుడు విద్యుత్ జమ్వాల్ చేసిన పనికి అంతా షాక్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేసిన ఓ వినూత్న ప్రదర్శన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

News18
News18

బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేసిన ఓ వినూత్న ప్రదర్శన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వేదికపై ఏకంగా 15 నిమిషాల పాటు శ్వాసను నియంత్రిస్తూ ధ్యానం చేసిన విద్యుత్.. తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

హాలీవుడ్‌లో విద్యుత్ జమ్వాల్ నటిస్తున్న తొలి చిత్రంగా ‘స్ట్రీట్ ఫైటర్’ నిలవనుంది. ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన ధల్సిమ్ అనే కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. గేమింగ్ ప్రపంచంలో ఎంతో పాపులర్ అయిన ఈ క్యారెక్టర్‌కు యోగా, ఆధ్యాత్మిక సాధనలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. దీంతో ఈ పాత్రకు విద్యుత్ జమ్వాల్ ఎంపిక కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

ముంబైలో నిర్వహించిన ఈవెంట్‌లో ధల్సిమ్ పాత్రకు సంబంధించిన కాస్ప్లేయర్లతో కలిసి విద్యుత్ జమ్వాల్ వేదికపైకి వచ్చారు. అనంతరం దాదాపు 15 నిమిషాల పాటు ఎలాంటి మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా ధ్యానం చేశారు. శ్వాసను నియంత్రిస్తూ ఆయన చేసిన ఈ ప్రదర్శన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. యాక్షన్ సన్నివేశాల్లో తన ప్రతిభను చూపించే విద్యుత్.. ఇలాంటి ప్రశాంతమైన సాధనలోనూ తనకు ఉన్న పట్టును చాటుకున్నారు.

ఈ సందర్భంగా విద్యుత్ మాట్లాడుతూ తాను పాటంజలి యోగసూత్రాల్లోని ఓ ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించినట్లు వెల్లడించారు. ఈ టెక్నిక్ ద్వారా శ్వాసను నియంత్రించడమే కాకుండా, తన జీవితంలో ఎన్నో లక్ష్యాలను సాధించగలిగానని చెప్పారు. ఈ పద్ధతిని యువతకు కూడా నేర్పిస్తున్నట్లు తెలిపారు. శారీరకంగా బలంగా ఉండటంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండటం కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు.

యువతకు సందేశం ఇస్తూ.. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలనే ఆలోచనతో నిరంతరం పరుగులు తీస్తున్నారని విద్యుత్ అన్నారు. అయితే జీవితంలో అప్పుడప్పుడు ఆగి ప్రశాంతంగా ఉండటం కూడా నేర్చుకోవాలని సూచించారు. ఎలాంటి పని చేయకుండా కొంత సమయం తనతో తాను గడపడం కూడా ఒక ముఖ్యమైన నైపుణ్యమేనని చెప్పారు.

లక్ష్యాలను సాధించడానికి కొంత సమయం పడుతుందని, వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ చెందకూడదని విద్యుత్ సూచించారు. పట్టుదలతో ప్రయత్నం కొనసాగిస్తే చివరికి విజయం తప్పకుండా సాధ్యమవుతుందని అన్నారు. ‘స్ట్రీట్ ఫైటర్’ సినిమాలో యోగా, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉన్న ధల్సిమ్ పాత్రలో నటిస్తున్న విద్యుత్.. ఈ కార్యక్రమం ద్వారా ఆ క్యారెక్టర్‌కు తాను ఎంతగా సరిపోతానో మరోసారి చూపించారు.

పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘స్ట్రీట్ ఫైటర్’ చిత్రం 2026 అక్టోబర్ 16న భారత్‌లో విడుదల కానుంది. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్‌లో విద్యుత్ జమ్వాల్ ఎంట్రీ కావడంతో ఈ సినిమాపై భారతీయ ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports