Delhi High Drama: రోడ్డుపై పడుకుని ప్రియాంక గాంధీ నిరసన …ఢిల్లిలో రచ్చ రచ్చ | ACTPnews

Delhi High Drama: రోడ్డుపై పడుకుని ప్రియాంక గాంధీ నిరసన ...ఢిల్లిలో రచ్చ రచ్చ



ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో రచ్చ రచ్చ వాతావరణం నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వైఖరికి నిరసనగా ఇండియా కూటమి నేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మల్లికార్జున ఖర్గే జాన్పత్లోని సాగర్ రత్నా రెస్టారెంట్లో ఇండియా కూటమి ఎంపీలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయగా, అనంతరం నేతలందరూ జంతర్ మంతర్ వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా మహిళా నేతలతో కలిసి విండ్సర్ సర్కిల్ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. #PriyankaGandhi #RahulGandhi #CongressProtest



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports