కాళ్లు, చేతులు లేని స్థితిలో మహిళ మృతదేహం.. పక్కనే మద్యం బాటిళ్లు.. నాగోల్‌లో దారుణం.. అసలేం జరిగింది..! Nagole woman murder. | | ACTPnews

News18

[ad_1]

Last Updated:

హైదరాబాద్ నాగోల్ పరిధిలోని తట్టి అన్నారంలో కాళ్లు, చేతులు లేని స్థితిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. మృతురాలు ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తింపు. గత నెల 28న ఆమెపై మిస్సింగ్ కేసు నమోదుకాగ

News18
News18

నాగోల్‌లో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. తట్టి అన్నారం గ్రామ సమీపంలోని ఓ నిర్జన ప్రదేశంలో కాళ్లు, చేతులు లేని స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం మార్నింగ్ వాకర్స్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

తట్టి అన్నారం ప్రాంతంలోని ఇందు అరణ్య విల్లాస్ ఎదురుగా ఉన్న కొత్త రోడ్డుపై మృతదేహం కనిపించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌తో కలిసి పరిసరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు కనిపించడం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. దీంతో మహిళను అక్కడికి తీసుకువచ్చారా..? లేక అక్కడే ఏదైనా జరిగిందా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మహిళ మృతికి అసలు కారణం ఏంటి, ఆమెపై లైంగిక దాడి జరిగిందా లేదా అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో కుక్కలు పీక్కుతిన్న ఆనవాళ్లు కనిపించినట్లు మరో నివేదిక పేర్కొంది. దీంతో మృతదేహంలోని కొన్ని భాగాలు కనిపించకపోవడానికి ఇదీ ఒక కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అయితే కాళ్లు, చేతులు ఎలా మాయమయ్యాయన్నది ప్రస్తుతం దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ అంశంపై కూడా పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఇక పోలీసుల దర్యాప్తులో మృతురాలిని ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించినట్లు సమాచారం. అసలు ట్విస్ట్ ఏంటంటే.. మంగమ్మ కనిపించడం లేదంటూ గత నెల 28న ఓయూ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. ఇప్పుడు తట్టి అన్నారం సమీపంలో మృతదేహంగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మంగమ్మ ఎక్కడికి వెళ్లింది..? ఆమె చివరిసారిగా ఎవరితో ఉంది..? తట్టి అన్నారం వరకు ఎలా వచ్చింది..? ఆమెను ఎవరు అక్కడికి తీసుకెళ్లారు..? ఈ ఘటనకు మద్యం బాటిళ్లకు ఏమైనా సంబంధం ఉందా..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసులో అసలు నిజం బయటపడే అవకాశం ఉంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports