Kisan Cricket League: పల్లె టాలెంట్ ఇక ప్రపంచ వేదికపై.. క్రికెట్‌తో పాటు గాయకులకు కూడా ఛాన్స్! | క్రీడా వార్తలు | ACTPnews

Kisan Cricket League: పల్లె టాలెంట్ ఇక ప్రపంచ వేదికపై.. క్రికెట్‌తో పాటు గాయకులకు కూడా ఛాన్స్! | క్రీడా వార్తలు


“ఖేలేగా భారత్, దేఖేగా ఇండియా” దార్శనికతతో, దేశవ్యాప్తంగా డిజిటల్ ఆడిషన్లు, ఏఐ-ఆధారిత స్క్రీనింగ్, ఆన్-గ్రౌండ్ ట్రయల్స్ వంటి వినూత్న విధానాల ద్వారా గ్రామీణ క్రికెటర్లు, గాయకులను వెలికితీసేందుకు కేసీఎల్ భారతదేశంలోనే అతిపెద్ద టాలెంట్ హంట్‌ను నిర్వహించనుంది. లైవ్ మ్యాచ్‌లు, రెండు రియాలిటీ షోలు మరియు విజయం సాధించిన వా రి జీవిత చరిత్రలతో సహా కేసీఎల్ కంటెంట్ మొత్తాన్ని వేవ్స్ ఓటీటీ, దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు లేదా వినవచ్చు.

క్రికెట్ ప్రారంభ సీజన్ 15 ఓవర్ల వైట్ బాల్ ప్రొఫెషనల్ క్రికెట్ ఫార్మాట్‌లో జరుగుతుంది. భారతదేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఏడు స్టేడియాల్లో 45 లైవ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లక్షలాది మంది పోటీదారుల నుండి ఎంపిక చేసిన ప్రతిభావంతులతో 7 జట్లు ఏర్పడతాయి. వీరిలో 140 మంది వర్ధమాన క్రికెటర్లు, 30 మంది గాయకులు ఉంటారు. ఈ లీగ్ ద్వారా వారి ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఎంపికైన గాయకులు ప్రాంతీయ జట్ల అంతెమ్స్ ఆలపిస్తారు, మ్యూజిక్ వీడియోలలో కనిపిస్తారు, అలాగే మ్యాచ్ హాఫ్‌టైమ్ మరియు మ్యాచ్ జరిగే రోజుల్లో తమ ప్రదర్శనలు ఇస్తారు.

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీ విక్రమ్ సింగ్ మాలిక్ మాట్లాడుతూ: “దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరువైన విస్తృత నెట్‌వర్క్ ప్రసార భారతికి ఉంది. సామాన్యుడికి బహుళ భాషలు, విభాగాల్లో విభిన్నమైన కంటెంట్‌ను ఉచితంగా అందించడమే మా ప్రయత్నం. మా సరికొత్త ‘వేవ్స్’ ఓటీటీ ఇప్పటికే 1.50 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లను ఆకర్షించి శరవేగంగా అభివృద్ధి చెందుతోంది” అని అన్నారు.

“కిసాన్ క్రికెట్ లీగ్‌తో గ్రామీణ ప్రాంతాలకు చెందిన, క్రికెటర్లు లేదా గాయకులు కావాలని కలలుకనే యువత ఆకాంక్షలను నెరవేరుస్తామని ఆశిస్తున్నాము. యువతరాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి మా ప్లాట్‌ఫారమ్‌లు ఒక వారధిగా పనిచేస్తాయి. అద్భుతమైన ఆర్కైవల్ కంటెంట్ లైబ్రరీ, వినోద రంగంలోని కొన్ని ప్రఖ్యాత టైటిల్స్, మా బృందం యొక్క ఉత్సాహంతో.. మన దేశంలోని అపారమైన ప్రతిభకు మద్దతు ఇవ్వడంతో పాటు, తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉన్న భారతీయ యువతకు సరికొత్త అవకాశాలు అందించడానికి మేము ఎదురుచూస్తున్నాము,” అని ఆయన తెలిపారు.

కిసాన్ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు & సీఈఓ, జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు అతుల్ పాండే మాట్లాడుతూ, “కిసాన్ క్రికెట్ అనేది నాకు ఒక క్రికెట్ లీగ్ కంటే ఎక్కువే. వినోద, మీడియా, క్రీడా రంగంలో నా 38 ఏళ్ల అనుభవంతో రూపుదిద్దుకుని, 2015 నుంచి నేను కంటున్న కల ఇది. ఒక వర్ధమాన క్రికెటర్‌గా నేను క్రికెట్‌ను జీవించాను, 1996, 1999 క్రికెట్ ప్రపంచకప్‌లను కవర్ చేశాను. రైతు ఆత్మహత్యలు, గ్రామీణ వ్యధల నేపథ్యంలో నిర్మాతగా నా మొదటి చిత్రం ‘సమ్మర్ 2007’ ద్వారా గ్రామీణ భారత కథలను కూడా చెప్పాను. వీటన్నింటిలో నాకనిపించిన ఒక విషయం ఏమిటంటే.. గ్రామీణ భారతదేశంలో అపారమైన ప్రతిభ, ఆశయం ఉన్నాయి, కానీ అందరికీ అవకాశం లభించడం లేదు” అని అన్నారు.

“ఆ పరిస్థితిని మార్చేందుకు నేను చేస్తున్న ప్రయత్నమే కేసీఎల్. అవకాశాలు నోచుకోని వర్గాల యువత.. తమ కలను నెరవేర్చుకోవడానికి, ఆడేందుకు, పోటీ పడేందుకు, గుర్తింపు తెచ్చుకునేందుకు ఇది ఒక వేదిక. ఎందుకంటే ఇది కేవలం క్రికెట్‌కు సంబంధించినది కాదు. ఒకరికి జీవితంలో ఎన్నడూ దొరకని అవకాశాన్ని కల్పించడం. ప్రపంచ ప్రేక్షకులను అలరించేలా ఆరు నెలల పాటు సాగే భారతీయ సాంస్కృతిక వేడుకగా క్రికెట్, సంగీతాన్ని అనుసంధానిస్తూ దీనిని రూపొందించాము. ఈ ప్రయాణంలో మా జాతీయ నాయకులతో పాటు విజేతలను, వారి వర్గాలను కేసీఎల్ సత్కరిస్తుంది” అని అతుల్ పేర్కొన్నారు.

సంప్రదాయ క్రికెట్ అకాడమీలు, స్కౌటింగ్ నెట్‌వర్క్‌లు లేదా ప్రొఫెషనల్ స్పోర్టింగ్ ఎకోసిస్టమ్‌లకు ప్రాప్యత లేని వర్ధమాన క్రికెటర్లను చేరుకునేలా కేసీఎల్ ప్రతిభ గుర్తింపు చొరవను రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ ఆధారిత జాతీయ అన్వేషణ ద్వారా టాలెంట్ డిస్కవరీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిజిటల్ స్క్రీనింగ్, ఫిజికల్ ట్రయల్స్ ఉంటాయి. లొకేషన్ ఆధారిత ఫీచర్లు, క్యూఆర్ కోడ్ ఇంటిగ్రేషన్ల ద్వారా ప్రేక్షకులను భాగస్వాములను చేయడం, పోటీలు, ఓటింగ్, మ్యాచ్ జరిగే రోజున ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచడం సాధ్యమవుతుంది.

కిసాన్ క్రికెట్ లీగ్ సీటీఓ అంబికా దాస్ మాట్లాడుతూ, “మేము డిజిటల్ ఇండియా స్పూర్తితో ముందుకు సాగుతున్నాము. కాబట్టి కేసీఎల్ ప్రతిభాన్వేషణ, ప్రేక్షకుల భాగస్వామ్య కార్యక్రమాలలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. కేసీఎల్ మొబైల్ యాప్ వెరిఫైడ్ రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్ టాలెంట్ సబ్‌మిషన్లు, ఆడిషన్‌లకు అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత టెక్నాలజీ ఆధారిత స్క్రీనింగ్, ట్రయల్స్ ఉంటాయి. ఈ రకంగా ఈ యాప్ ఒక డిజిటల్ ఈక్వలైజర్‌గా పనిచేస్తుంది” అని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports