Ranabaali Trailer: రణబాలి ట్రైలర్‌ రిలీజ్.. ఇరగ దీసిన విజయ్ దేవరకొండ, ఇక ఈ హైప్ ఎవ్వరూ ఆపలేరు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రణబాలి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న హైప్ కి రెక్కలు కట్టారు మేకర్స్.

News18
News18

దసరా కానుకగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ‘ట్యాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ లాంటి విభిన్నమైన సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం, తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం రోమాలు నిక్కబొడుచుకునేలా, యాక్షన్ ప్యాక్డ్‌గా సాగింది.

ఈ చిత్ర కథాంశం, నేపథ్యం విషయానికొస్తే.. 1854 – 1878 మధ్య కాలంలో బ్రిటిష్‌ ఇండియా పాలనలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జరిగిన కొన్ని సున్నితమైన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ట్రైలర్‌లో ‘శింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ తన నట విశ్వరూపం చూపించారు. మునుపెన్నడూ చూడని అత్యంత మాస్, ఫెరోషియస్ లుక్‌లో ఆయన యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఆయనకు జోడీగా, పల్లెటూరి మహిళ భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన్న ఒదిగిపోయింది. ‘ది మమ్మీ’ ఫేమ్, హాలీవుడ్ దిగ్గజ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ ఈ సినిమాలో క్రూరమైన బ్రిటిష్ అధికారిగా విలన్ పాత్రలో నటించడం విశేషం. ట్రైలర్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా స్థాయిని పెంచింది.

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న ముచ్చటైన మూడో చిత్రమిది. అయితే, వీరు నిజజీవితంలో భార్యాభర్తలుగా మారిన తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై ఎనలేని ఆసక్తి నెలకొంది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ సంస్థ టీ-సిరీస్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ అజయ్ – అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. నీరవ్ షా, జిష్ణు భట్టాచార్జీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ విజువల్స్ పీరియాడిక్ కాలాన్ని కళ్లకు కట్టాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సింగిల్ అంచనాలను పెంచేయగా.. తాజా ట్రైలర్ సినిమాపై హైప్‌ను పీక్స్‌కు చేర్చింది. విజయ దశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 16న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘రణబాలి’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports