కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో ధర్మం గెలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కాళేశ్వరంపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి, ఆడుతున్న డ్రామాలకు హైకోర్టు తీర్పుతో తెరపడింది” అని అన్నారు. పి.సి. ఘోష్ కమిషన్ ద్వారా తమను ఇబ్బంది పెట్టాలని చూసిన కాంగ్రెస్ సర్కార్కు ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని సాకులు చెబుతూ, రిపేర్లు చేయకుండా రైతులకు సాగునీరు అందకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Source link
Harish Rao on Kaleshwaram Verdict: సీఎం రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










