Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఇదీ షో పరిస్థితి!! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బిగ్ బాస్ సీజన్ 10 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. గత తొమ్మిది సీజన్లతో పోలిస్తే ఈ పదివ సీజన్ కనీవినీ ఎరుగని ట్విస్టులు, వివాదాలతో పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకొచ్చింది.

News18
News18

బిగ్ బాస్ సీజన్ 10 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. గత తొమ్మిది సీజన్లతో పోలిస్తే ఈ పదివ సీజన్ కనీవినీ ఎరుగని ట్విస్టులు, వివాదాలతో మొదటి వారం నుంచే ప్రేక్షకుల అటెన్షన్‌ను పూర్తిగా గ్రాబ్ చేసింది. సాధారణంగా ఏ సీజన్‌లో అయినా రెండు లేదా ఐదో వారం తర్వాత కంటెస్టెంట్ల మధ్య అసలైన ఆట మొదలవుతుంది. కానీ ఈసారి అంచనాలకు భిన్నంగా మొదటి వారంలోనే డబుల్ ఎలిమినేషన్ ప్రకటించి, ఆ వెంటనే ఒకరిని హౌస్‌లోకి తిరిగి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న ఫిజికల్ ఛాలెంజ్‌లు, నామినేషన్ల వేడి, అలాగే కొందరు కంటెస్టెంట్లు ఉద్దేశపూర్వకంగా ‘ఫిమేల్ కార్డ్’ వాడుతున్నారనే ఆరోపణలు షోపై ఉత్కంఠను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇక వీకెండ్ ఎపిసోడ్స్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల పట్ల వ్యవహరిస్తున్న కఠినమైన తీరు, ఆయన ఇస్తున్న వార్నింగ్‌లు షోను మరో స్థాయికి తీసుకెళ్లాయి. గత వారం ఏకంగా ముగ్గురు సభ్యులకు ‘ఎల్లో కార్డ్’ ఇవ్వడంతో పాటు, రోహిత్ నాయుడు ఆటతీరుపై సీరియస్ అవుతూ ఏకంగా ‘గెట్ అవుట్’ అనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా కంటెస్టెంట్ల వ్యూహాలు, ప్రైజ్ మనీ (Prize Money) చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతున్నాయి. సాధారణంగా ఫినాలేకు ముందు ఇచ్చే బిగ్ బాస్ సూట్‌కేస్ ఆఫర్‌ను అనూహ్యంగా మూడో వారంలోనే ప్రవేశపెట్టగా.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కామనర్ మిథిలేష్ రెడ్డి ఏకంగా రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకొని గేమ్ నుంచి క్విట్ అవ్వడం బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్.

ఈ వరుస పరిణామాల నేపథ్యంలో టెలివిజన్ టీఆర్‌పీతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ బిగ్ బాస్ 10వ సీజన్ వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలుకొడుతోంది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ రియాలిటీ షో అక్టోబర్ 8 నాటికి, అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే 8 కోట్ల 20 లక్షల మంది వ్యూయర్స్‌ను ఆకర్షించింది. ఇదే జోరు కొనసాగితే ఫినాలే నాటికి 20 కోట్ల వ్యూస్ మార్క్‌ను సునాయాసంగా టచ్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ని వ్యూస్ ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో మరే సీజన్ కి కూడా రాలేదని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ కొత్త సీజన్లు నడుస్తున్నప్పటికీ, అన్నింటికంటే తెలుగు సీజన్‌కే అత్యధిక వ్యూస్ వస్తుండటం విశేషం. రాబోయే రోజుల్లో మరిన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఈ సీజన్ సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports