Last Updated:
13 ఏళ్లకే ఏఐ అకాడమీ. ఏఐతో చదువును ఆటకు మల్లే మార్చేసిన 13 ఏళ్ల కుర్రాడు. ఎలాగో మీరే చూడండి!
వయసు చిన్నదే.. కానీ లక్ష్యం ఆకాశమంత. ఆడుకునే వయసులోనే అద్భుతాలు సృష్టిస్తూ, నేటి తరానికి సరికొత్త స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఓ కుర్రాడు. అతడే వైభవ్. కేవలం 13 ఏళ్ల చిరుప్రాయంలోనే ‘వైభవ్ ఏఐ అకాడమీ’ స్థాపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను నేర్చుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విజ్ఞానాన్ని తన దగ్గరే ఉంచుకోకుండా పదిమందికి పంచాలనే సంకల్పంతో మొదటి అడుగు వేశాడు. లక్షలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలనే బృహత్తర లక్ష్యంతో ఉరకలెత్తుతున్నాడు.
జ్ఞానాన్ని పంచుకుంటే పెరుగుతుందే తప్ప తరగిపోదు అనే సత్యాన్ని వైభవ్ తన చిన్న వయసులోనే నిరూపిస్తున్నాడు. అకాడమీ ప్రారంభించిన తొలి అడుగులోనే రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చిన ఈ కుర్రాడు, ఇప్పటివరకు విజయవంతంగా నాలుగు బ్యాచ్‌లను పూర్తి చేశాడు. మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ కోచ్ ఇతను. ఇప్పటికే 200 మందికి పైగా విద్యార్థులకు ఏఐ సాంకేతికతను పరిచయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. భవిష్యత్ తరాలను ఏఐతో సాధికారంగా తీర్చిదిద్ది, సరికొత్త లీడర్లను సృష్టించడమే వైభవ్ ఏఐ అకాడమీ ప్రధాన ఉద్దేశం. ఈ అత్యాధునిక సాంకేతికతను దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా అకాడమీ పరుగులు పెడుతోంది.
ఈ లక్ష్య సాధనలో భాగంగా వైభవ్ ’21-రోజుల ఏఐ స్మార్ట్ లెర్నింగ్ ప్రోగ్రాం’కు శ్రీకారం చుట్టాడు. విద్యార్థులను పాతకాలపు బట్టీ విధానం నుంచి స్మార్ట్ లెర్నింగ్ వైపు నడిపించడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం. మునుపటి తరాల మాదిరిగా పుస్తకాల్లోని గుండె నిర్మాణం, కిరణజన్య సంయోగక్రియ లాంటి అంశాలను గుడ్డిగా చదివి పరీక్షలు రాయడం కాకుండా.. వాటిని త్రీడీ విజువల్స్, యానిమేషన్ల రూపంలో కళ్లకు కట్టినట్లుగా ఈ కోర్సులో బోధిస్తారు. అర్థం చేసుకోకుండా బట్టీ పట్టే విధానానికి శాశ్వతంగా స్వస్తి పలికి, అభ్యాసాన్ని సులభంగా, సృజనాత్మకంగా మార్చడం ఈ ప్రోగ్రాం ప్రత్యేకత.

ఈ వినూత్న ప్రోగ్రాంలో విద్యార్థులు ఎన్నో ఆధునిక నైపుణ్యాలను అత్యంత సులువుగా నేర్చుకుంటారు. కష్టమైన సబ్జెక్టులను సింపుల్‌గా అర్థం చేసుకోవడం, టెక్స్ట్‌ను అద్భుతమైన చిత్రాలుగా, మైండ్ మ్యాప్స్‌గా మార్చుకోవడం ఇక్కడ నేర్పిస్తారు. ఏఐ సాయంతో ఎడ్యుకేషనల్ వీడియోలు తయారు చేయడం, చాట్‌జీపీటీ, జెమినీ, గ్రోక్, క్లాడ్, నోట్‌బుక్ ఎల్‌ఎం లాంటి ఏఐ టూల్స్‌ను పర్సనల్ స్టడీ అసిస్టెంట్లుగా వాడుకోవడం ఇందులో వివరిస్తారు. సరైన ప్రాంప్ట్స్ రాయడం, ఏదైనా అంశంపై ఏఐతో లోతైన పరిశోధన చేయడం, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించుకోవడం విద్యార్థులకు సులభతరం అవుతాయి. వీటితో పాటే ఏఐ ద్వారా క్విజ్‌లు, రివిజన్ నోట్స్ తయారు చేసుకుంటూ పిల్లలు తమ ఆలోచనా శక్తిని పెంపొందించుకుంటారు.

పిల్లలు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టడం కాకుండా, తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను అర్థం చేసుకోవాలన్నదే ఈ అకాడమీ అసలు ఉద్దేశం. కేవలం గూగుల్‌లో సమాచారం వెతకడం మాత్రమే కాకుండా ఏఐతో స్మార్ట్ రీసెర్చ్ చేయడం ద్వారా నేటి విద్యార్థులు భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతారు. సరైన సాంకేతికతకు అత్యుత్తమ లెర్నింగ్ మెథడ్ తోడైతే చదువు ఏమాత్రం కష్టం కాదని వైభవ్ నిరూపిస్తున్నాడు. ‘లర్న్ స్మార్ట్, థింక్ క్రియేటివ్, రీసెర్చ్ బెటర్, బిల్డ్ ది ఫ్యూచర్’ అనే నినాదంతో సాగుతున్న ఈ కోర్సును పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్ కూడా అందిస్తారు. దసరా సెలవుల నేపథ్యంలో పిల్లలకు ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. హాలిడేస్‌లో ఏఐ మెళుకువలు నేర్చుకోవచ్చు. పలు గర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉచితంగానే వైభవ్ ఏఐ మెలుకువలు నేర్పిస్తున్నారు. ఇకపోతే వైభవ్ ఇటీవలనే సూపర్ ఏఐ స్టూడెంట్ అనే బుక్ కూడా రాశారు. ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. పూర్తి వివరాల కోసం 6305241801 సంప్రదించొచ్చు.














