Baa Baa Black Sheep: బా బా బ్లాక్ షీప్‌ రివ్యూ.. ఈ డిఫరెంట్ టైప్ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

క్రైమ్ కామెడీ కథతో ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని పంచడానికి థియేటర్స్ లోకి వచ్చేసింది బా బా బ్లాక్ షీప్‌ మూవీ. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా..

News18
News18

టాలీవుడ్‌లో క్రైమ్ కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని పంచే ఈ జానర్‌లో నిరంతరం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవలో తాజాగా థియేటర్లలోకి వచ్చిన మరో ఆసక్తికరమైన వినూత్న చిత్రమే ‘బా బా బ్లాక్ షీప్‌’. చిత్రాల‌యం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో, యువ ద‌ర్శ‌కుడు గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి ఉన్న అతిపెద్ద విశేషం ఏమిటంటే.. ఇది పూర్తిగా మేఘాలయ రాష్ట్రంలో చిత్రీకరించబడిన తొలి దక్షిణాది సినిమా కావడం. అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ ఒక క్రైమ్ కామెడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

దేశంలోని ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి ఇద్దరు బడా వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటారు. అందులో ఒకరు ప్రాజెక్టును శాసించే ఓ పెద్దాయనను ప్రసన్నం చేసుకోవడానికి స్వాతంత్ర్య కాలం నాటి ఒక అరుదైన వస్తువును బహుమతిగా ఇవ్వాలనుకుంటాడు. ఆ బాక్స్‌ను వెతికే బాధ్యతను గ్యాంగ్‌స్ట‌ర్ జాన్‌ (ఉపేంద్ర లిమాయె)కు అప్పగిస్తాడు. మరోవైపు మేఘాలయలో పెళ్లికి సిద్ధమైన స‌త్తిపండు (విష్ణు ఓయ్), తన స్నేహితుడు సందీప్‌ (అక్ష‌య్ లగుసాని)లతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుండగా ఓ యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదం కారణంగా ఆ అరుదైన బాక్స్ సందీప్ చేతికి చిక్కుతుంది. ఆ తర్వాత ఆ బాక్స్ కోసం గ్యాంగ్‌స్టర్ జాన్ వీరిని ఎలా వెంటాడాడు? ప్రాణస్నేహితుడిని కాపాడుకోవడానికి సందీప్ ఏం చేశాడు? చివరకు ఆ బాక్స్‌లో ఉన్న రహస్యం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

క్రైమ్ కాన్సెప్ట్ కి కామెడీ మిక్స్ చేస్తూ దర్శకుడు కథను బాగానే హ్యాండిల్ చేశాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు రొటీన్ ఫీలింగ్ తెప్పించినా కథలో లీనం చేస్తూ సినిమాకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సందీప్ పాత్రలో అక్షయ్ లగుసాని ఎనర్జిటిక్ యాక్టింగ్, డాన్సులతో అదరగొట్టాడు. సత్తిపండు పాత్రలో విష్ణు ఓయ్ తనదైన కామెడీ టైమింగ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమాయె గ్యాంగ్‌స్టర్‌గా పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ లుక్‌లో మెప్పించారు. విస్మయశ్రీ, రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్, మాల్వీ మల్హోత్రా తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. అజయ్ అబ్రహం జార్జ్ కెమెరా వర్క్ మేఘాలయ ప్రకృతి అందాలను అద్భుతంగా ఆవిష్కరించింది. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. నిర్మాత వేణు దోనేపూడి ఖర్చుకు వెనుకాడకుండా దర్శకుడు గుణి మంచికంటి విజన్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. లిమిటెడ్ బడ్జెట్‌లో ఇంత గ్రాండ్‌గా తెరకెక్కించడం విశేషం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

చివరి మాట.. నవ్వులు, థ్రిల్స్ కలగలిపిన ‘బా బా బ్లాక్ షీప్‌’ థియేటర్లలో ప్రేక్షకులను ఆసాంతం అలరించే ఓ పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్.

రేటింగ్ : 2.75



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *