Last Updated:
‘ఇరుముడి’ సినిమాతో అరివీర భయంకర హిట్టు కొట్టిన రవితేజ ఇప్పుడు వివేక్ ఆత్రేయతో తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేసింది.
‘ఇరుముడి’ సినిమాతో అరివీర భయంకర హిట్టు కొట్టిన రవితేజ ఇప్పుడు వివేక్ ఆత్రేయతో తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. నిజానికి ‘ఇరుముడి’ తర్వాత రవితేజ వెంటనే ‘స్వాగ్’ దర్శకుడు హర్షిత్ గోలి దర్వకత్వంలో ఓ సినిమా చేయాలి. ఆ తర్వాతే వివేక్ ఆత్రేయతో సినిమా చేయాలి. కానీ ఇరుముడి సినిమా ఊహించని రేంజ్‌లో హిట్టు కొట్టడంతో వివేక్ ఆత్రేయతో ముందుగా చేయాలని డిసైడ్ అయ్యాడు.
అయితే.. హర్షిత్ చెప్పిన కథలో కొన్ని చేంజెస్ చేయమని రవితేజ చెప్పాడట. ఈ లోపు వివేక్ ఆత్రేయ ఫుల్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉండటంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ మూవీకి తులాభారం అనే టైటిల్‌ను ప్రకటిస్తూ స్పెషల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కథకు తగ్గట్లు ఎన్నో టైటిల్స్ అనుకున్నా… చివరికి ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని ఈ మూవీ యాక్టర్లతో స్పెషల్ వీడియో చేసి రిలీజ్ చేశారు.
నిజానికి వివేక్ ఆత్రేయ టైటిల్స్ అన్ని సహజత్వానికి చాలా దగ్గరగా.. అసలు టైటిల్ అర్థం ఏంటో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో ఉంటాయి. అలానే ఇప్పుడు తులాభారం అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్‌తో పాటు అనస్వర రాజన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించగా.. జే.డీ చక్రవర్తి నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.
మొత్తానికి పంచాయితీ అలా నడిచిందిరా అబ్బాయిలు…. 😀
#RT78 is #Thulabharam 🔥
▶️ https://t.co/jGvnjyDphwAnnitini Balance chesthu kummeddam 🤗
The Crime Maharaja @RaviTeja_offl #TharunBhascker #VivekAthreya @priyankaamohan #AnaswaraRajan @JDmaxmode #VivekSagar @thenieswar #RaviTejaGirijala #GMSekhar
#Laxman #SriniRao @BridgeProdoffl— Bridge Productions (@BridgeProdoffl) October 11, 2026
ఇక ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లర్, హార్రర్, పాలిటిక్స్, ఫ్యామిలీ.. ఇలా అన్ని రుచులు ఉండనున్నట్లు వీడియోలో వెల్లడించారు. మొత్తానికి ఒక్క టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే తిరుగులేని అంచనాలు క్రియేట్ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మూవీని ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్‌లో సహా నిర్మాతగా చేసిన శిరీష్ నిర్మిస్తున్నాడు.














