PM Modi: తమిళనాడు అభివృద్ధికి సీఎం విజయ్‌తో కలిసి పనిచేస్తాం.. కరుణానిధి, జయలలితలను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ! | | ACTPnews

News18


Last Updated:

రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమిళనాడు ప్రగతి కోసం ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెన్నై సభలో ప్రకటించారు.

News18
News18

తమిళనాడును అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, ఇందుకోసం ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌తో కలిసి పనిచేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చెన్నై నగరంలో ఆదివారం జరిగిన అధికారిక సభలో రూ.13,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం విజయ్ సమక్షంలో ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, పన్నీర్‌సెల్వం, పళనిస్వామి, స్టాలిన్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

ప్రభుత్వాలు మారినా తమిళనాడు ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల తనకున్న చిత్తశుద్ధి ఎప్పటికీ మారలేదని తేల్చిచెప్పారు. ఇప్పుడు ఇదే ప్రయాణాన్ని నూతన ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఉద్ఘాటించారు. పాలనా రంగంలో ఇరు ప్రభుత్వాల సమన్వయం రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సహకార సమాఖ్య స్ఫూర్తి.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులు

ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న క్రమంలో ప్రజలపై, సహకార సమాఖ్య వ్యవస్థపై తన నమ్మకం మరింత బలపడిందని మోదీ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధే తన ఏకైక నినాదమని వెల్లడించారు. తాజా ప్రాజెక్టులు ప్రజల రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చి వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలు 5 నగరాల నుంచి 25 నగరాలకు విస్తరించాయని వివరించారు.

అంతకుముందు చెన్నై మెట్రో ఫేజ్-2 కింద రూ.4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన పూనమల్లి-వడపళని మార్గాన్ని సీఎం విజయ్‌తో కలిసి ప్రధాని ప్రారంభించారు. దాదాపు 15 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్‌లో 11 ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. కౌంటర్‌లో స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన ప్రధాని మోదీ, సీఎం విజయ్‌తో కలిసి నూతన మెట్రో రైలులో ప్రయాణించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన విజయ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రధాని బహిరంగంగా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed