Jailer 2 Movie: రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న ‘జైలర్-2’ మూవీ.. ఇది కదా సూపర్ స్టార్ రేంజ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఈ వారం రిలీజ్ కాబోతున్న జైలర్ 2 సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఒక్క తమిళ ఆడియెన్స్ మాత్రమే కాదు.. తెలుగు ఆడియెన్స్ కూడా తెగ వేయిట్ చేస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ ఊచకోత ఈ సారి ఊహకు కూడా అందదు అనే రేంజ్‌లో అంచనాలు పెట్టేసుకున్నారు.

News18
News18

ఈ వారం రిలీజ్ కాబోతున్న జైలర్ 2 సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఒక్క తమిళ ఆడియెన్స్ మాత్రమే కాదు.. తెలుగు ఆడియెన్స్ కూడా తెగ వేయిట్ చేస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ ఊచకోత ఈ సారి ఊహకు కూడా అందదు అనే రేంజ్‌లో అంచనాలు పెట్టేసుకున్నారు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా.. ఫస్ట్ హాఫ్ ఊహించని రేంజ్‌లో హిట్టు కావడంతో దాని తాలూకు ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం అలానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు సంబంధించిన గణాంకాలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

‘జైలర్ 2’పై మొదట్లో ఉన్నంత హైప్ ప్రస్తుతం కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ, సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, బుకింగ్స్ ఓపెన్ చేసిన కేంద్రాల్లో మంచి స్పందన కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో టికెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తుంది.

భారీ విజయాన్ని అందుకున్న సినిమాకు సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై అంచనాలను పెంచే ప్రయత్నం చేసింది. అయితే, విడుదల సమయానికి ఈ హైప్ మరింత పెరుగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల మార్క్:

తాజా సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్త అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇప్పటికే రూ.25 కోట్ల మార్క్‌ను దాటినట్లు ప్రచారం జరుగుతోంది. విడుదలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే ఈ స్థాయి వసూళ్లు సాధించినట్లు వస్తున్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. అయితే, ఈ గణాంకాలకు సంబంధించిన అధికారిక ట్రేడ్ ధ్రువీకరణ అందుబాటులో ఉంటేనే పూర్తి స్పష్టత వస్తుంది.

మరోవైపు, బుక్‌మైషోలో ప్రధాన కేంద్రాల్లో బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత ప్రతి గంటకు సుమారు 35 వేల నుంచి 40 వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు సమాచారం. ఇదే వేగం కొనసాగితే విడుదల సమయానికి బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా చివరి నిమిషంలో బుకింగ్స్ పుంజుకుంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశముంది.

కూలీతో పోలిస్తే ఇంకా పెరగాల్సిన జోరు:

రజినీకాంత్ గత చిత్రం ‘కూలీ’తో పోలిస్తే ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ మరింత వేగం అందుకోవాల్సి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, సీక్వెల్ సినిమాలకు విడుదలకు ముందు చివరి రెండు, మూడు రోజుల్లో బుకింగ్స్ పెరగడం సాధారణమే. అందువల్ల ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ ఆధారంగా తుది ఓపెనింగ్స్‌ను అంచనా వేయడం కొంత తొందరపాటే అవుతుంది.

ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందా?

ప్రస్తుత బుకింగ్స్ ట్రెండ్ కొనసాగి, విడుదల సమయానికి అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందన లభిస్తే ‘జైలర్ 2’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే రూ.125 కోట్ల నుంచి రూ.140 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ దిశగా కూడా వెళ్లవచ్చనే ట్రేడ్ అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవి అంచనాలు మాత్రమే.. తుది వసూళ్లు టికెట్ విక్రయాలు, విడుదలైన ప్రాంతాలు, ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి ఉంటాయి.

సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రజినీకాంత్ బాక్సాఫీస్ స్టామినా మరోసారి కనిపించే అవకాశం ఉంది. మరి ‘జైలర్ 2’ మొదటి భాగం సృష్టించిన రికార్డులను అధిగమిస్తుందా? లేదా అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed