Last Updated:
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆయన మెరుపు హాఫ్ సెంచరీతో భారత్ ప్రత్యర్థి ముందు 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కరీబియన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సంజు శాంసన్ (3), శ్రేయస్ అయ్యర్ (1) ఆరంభంలోనే విఫలమైనప్పటికీ, అభిషేక్ కేవలం 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 69 పరుగులు బాది ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. ఆయనకు తోడుగా ఇషాన్ కిషన్ 18 బంతుల్లోనే 37 పరుగులు చేసి వేగంగా స్కోరు పెంచారు. తిలక్ వర్మ 28 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి 21, అక్షర్ పటేల్ 20 పరుగులు జోడించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ గెలవాలంటే 224 పరుగులు చేయాల్సి ఉంది.














