Archery Premier League: ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో చేరో ఆర్చర్స్ తుఫాన్ జోరు.. కాకతీయ నైట్స్‌ను 6-0తో క్లీన్‌స్వీప్ చేసిన అతాను సేన! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో చేరో ఆర్చర్స్ అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్థానిక కాకతీయ నైట్స్ జట్టుపై 6-0 తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది.

News18
News18

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) రెండో సీజన్‌లో చేరో ఆర్చర్స్ జట్టు విజయాల బాటలో దూసుకుపోతోంది. శనివారం నాటి ‘సడన్ డెత్’ ఉత్కంఠ ఓటమి నుంచి వేగంగా కోలుకున్న ఆర్చర్స్ జట్టు, హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్థానిక ఫ్రాంచైజీ కాకతీయ నైట్స్‌ను 6-0 తేడాతో చిత్తుగా ఓడించింది. కెప్టెన్ అతాను దాస్ నాయకత్వంలో అద్భుత ఫామ్‌లో ఉన్న చేరో ఆర్చర్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో నెగ్గి టోర్నీలో తిరుగులేని శక్తిగా నిలిచింది. మరోవైపు కాకతీయ నైట్స్ ఖాతాలో ఇప్పటివరకు రెండు గెలుపులు, రెండు ఓటములు చేరాయి.

అతాను, ఫుల్లర్టన్ మెరుపులు

చేరో ఆర్చర్స్ ఘనవిజయంలో కెప్టెన్ అతాను దాస్, కాంపౌండ్ స్టార్, వరల్డ్ నంబర్ 1 మథియాస్ ఫుల్లర్టన్ కీలక పాత్ర పోషించారు. డెన్మార్క్ ఆర్చర్ ఫుల్లర్టన్ సంధించిన 6 బాణాలకు గానూ అత్యధికంగా 59 పాయింట్లు సాధించి మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాకతీయ నైట్స్ తమ తుది జట్టులో ఆస్ట్రియా కాంపౌండ్ స్టార్ నికో వీనర్ స్థానంలో శివశంకర్ ల్యాండ్‌కర్‌ను మైదానంలోకి దించింది. శివశంకర్, వెన్నం జ్యోతి సురేఖ జంట ఆకట్టుకున్నప్పటికీ ప్రత్యర్థి చేరో ఆర్చర్స్ ధాటికి తట్టుకోలేకపోయారు.

6-0తో చేరో క్లీన్‌స్వీప్

ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే చేరో ఆర్చర్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌లో మొదటి ఏడు బాణాలకు 70 పాయింట్లకు గానూ 69 పాయింట్లు సాధించి ఆర్చర్స్ జట్టు ముందంజ వేసింది. రెండో సెట్‌లో అతాను దాస్ పర్ఫెక్ట్ ఎక్స్ రింగ్ పాయింట్‌తో మెరిసి జట్టుకు 4-0 ఆధిక్యాన్ని అందించాడు. ఉత్కంఠగా సాగిన మూడో సెట్‌లో ఎనిమిది బాణాల తర్వాత స్కోరు సమంగా ఉన్న వేళ, తీవ్ర ఒత్తిడిలోనూ అతాను దాస్, కేసీ కాఫ్‌హోల్డ్ చెరో 10 పాయింట్ల బాణాలు విసిరి సెట్‌ను చేజిక్కించుకున్నారు. దాంతో నాలుగో సెట్‌తో అవసరం లేకుండానే 6-0తో ఘన విజయాన్ని ఖాయం చేసుకున్నారు.

సోమవారం (అక్టోబర్ 12) మ్యాచ్‌ల షెడ్యూల్:

చేరో ఆర్చర్స్ X మైటీ మరాఠాస్

రాజ్‌పుతానా రాయల్స్ X చోళ చీఫ్స్

పృథ్వీరాజ్ యోధాస్ X కాకతీయ నైట్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed