IPL 2026: చెలరేగిన చిచ్చర పిడుగు.. లక్నోపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

లక్నో సూపర్ జెయింట్స్‌కు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది.

News18
News18

లక్నో సూపర్ జెయింట్స్‌కు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించి లక్నోను షాక్‌కు గురిచేసింది.

లఖ్‌నవూ బౌలర్లలో ఆకాశ్ మహరాజ్, మోహ్సిన్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత బలపరుచుకుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరిన ఈ జట్టు, ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. మే 24న ముంబయి ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించనుంది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఫామ్‌లో కనిపించాడు. కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు బాదుతూ సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అతని ఇన్నింగ్స్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. మరో వైపు యశస్వీ జైశ్వాల్ స్థిరంగా ఆడి 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ మాత్రం దృవ్ జురేల్ ఇన్నింగ్స్. ఒత్తిడిని కూల్‌గా ఎదుర్కొంటూ 53 పరుగులతో అజేయంగా నిలిచిన అతను చివరి వరకు క్రీజులో ఉండి రాజస్థాన్ విజయాన్ని ఖాయం చేశాడు. కీలక దశలో అతని షాట్లు మ్యాచ్‌ను లక్నో చేతుల నుంచి లాగేశాయి.

ఇంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ పూర్తి ఆధిపత్యంతో సాగింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోస్ ఇంగ్లిస్ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను లాక్కొచ్చారు. తొలి వికెట్‌కు కేవలం 50 బంతుల్లోనే 109 పరుగులు జోడించి రాజస్థాన్ బౌలింగ్ దళాన్ని ఒత్తిడిలోకి నెట్టేశారు.

మిచెల్ మార్ష్ విధ్వంసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 57 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి కేవలం నాలుగు పరుగుల దూరంలో రనౌట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పేశాయి. జోస్ ఇంగ్లిస్ కూడా 29 బంతుల్లో 60 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే పరుగుల వరద పారించాడు. మిడిల్ ఓవర్లలో నికోలస్ పూరన్ (16), ఆయుష్ బదోని (0) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ చివర్లో వేగంగా ఆడి 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు స్కోర్‌ను 220 దాటించాయి.

చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో జరిగిన రెండు కీలక రనౌట్లు మ్యాచ్‌ను పూర్తిగా తిప్పేశాయి. ముందుగా సెంచరీ మిస్ అయిన మార్ష్ రనౌట్ కాగా, వెంటనే పంత్ కూడా పెవిలియన్ చేరడంతో లక్నో ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. ఇలా బ్యాటింగ్ పవర్‌తో రెండు జట్లు ఉత్కంఠభరిత పోరాటం చేసిన ఈ మ్యాచ్‌లో చివరికి రాజస్థాన్ రాయల్స్ ధైర్యంగా ఆడి విజయం సాధించింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *