నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిప్పులు చెరిగారు. “అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?” అంటూ ఆమె కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించి రాజకీయంగా అన్యాయం చేయాలని చూడటం కుట్రపూరితమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లను 2029 వరకు వాయిదా వేయడం మహిళా లోకాన్ని వంచించడమేనని, జనగణనతో సంబంధం లేకుండా ఇప్పుడే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా సాగిన ఆమె ప్రసంగం సభలో అందరి దృష్టిని ఆకర్షించింది.
Source link
Kadiyam Kavya's Roar in LS: తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?".. ఎంపీ కడియం కావ్య ఫైరింగ్ స్పీచ్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










