Virat Kohli: కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. వీడియో చూస్తే పాపం అనాల్సిందే | క్రీడా వార్తలు | ACTPnews

విరాట్ కోహ్లీ అభిమాని


Last Updated:

తన ఆరాధ్య దైవం ఆటోగ్రాఫ్ కోసం ఒక చిన్నారి అభిమాని పడిన ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ హృదయ విదారక దృశ్యం చోటుచేసుకుంది.

విరాట్ కోహ్లీ అభిమాని
విరాట్ కోహ్లీ అభిమాని

Virat Kohli: మైదానంలో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝులిపిస్తుంటే స్టేడియం హోరెత్తిపోతుంది. కానీ, అదే మైదానం వెలుపల తన ఆరాధ్య దైవం ఆటోగ్రాఫ్ కోసం ఒక చిన్నారి అభిమాని పడిన ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ హృదయ విదారక దృశ్యం చోటుచేసుకుంది.

అభిమాని ఆవేదన

బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్న ఆశతో ఒక చిన్న బాలుడు స్టేడియంలో ఆయనను కలిసేందుకు ప్రయత్నించాడు. రెండు సార్లు కోహ్లీకి దగ్గరగా వెళ్లినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి అధికారులు ఆ బాలుడిని అడ్డుకున్నారు. కోహ్లీ తన ధ్యాసలో తాను ఉండటంతో ఆ బాలుడిని గమనించలేకపోయారు. తన ప్రయత్నం విఫలం కావడంతో మనస్తాపానికి గురైన ఆ చిన్నారి, ఖాళీ చేతులతో వెనుదిరుగుతూ వెక్కివెక్కి ఏడ్చాడు. తీవ్ర అసహనంతో తన చేతిలో ఉన్న బ్యాట్‌ను కింద పడేసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఢిల్లీపై ఆర్సీబీ బౌలర్ల పంజా

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆర్సీబీ బౌలర్లు చిగురుటాకులా వణికించారు. కొత్త బంతితో జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. ఒక దశలో 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. డెబ్యూటెంట్ సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వీ, కెప్టెన్ అక్షర్ పటేల్ డకౌట్లుగా వెనుదిరిగారు. అభిషేక్ పోరెల్ (30), డేవిడ్ మిల్లర్ (19), కైల్ జేమీసన్ (12) కాసేపు పోరాడినా, ఢిల్లీ జట్టు 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.

లక్ష్య ఛేదనలో కోహ్లీ మెరుపులు

76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్ (20) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వన్ డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా, కోహ్లీ 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. టి.నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన కోహ్లీ, విన్నింగ్ రన్స్ పూర్తి చేసి జట్టుకు 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించాడు.

పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి..

ఈ అద్భుత విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. విరాట్ కోహ్లీ ప్రస్తుత సీజన్‌లో 8 ఇన్నింగ్స్‌లలో 351 పరుగులు పూర్తి చేసుకుని, ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ (380 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌ను మే 30న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports