బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదుగా తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా బిగ్‌బాస్ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదుగా తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ జరిగింది.

News18
News18

తెలుగులో ప్రస్తుతం ట్రావెల్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్స్ చాలానే ఉన్నాయి. వీటన్నింటికీ మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగులో ట్రావెల్ నేపథ్యంలో తొలి తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభం కావడం విశేషం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా బిగ్‌బాస్ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదుగా ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభం అయింది. దేని పేరు విహారి OTT. ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి, ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది. ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి, ఇప్పుడు OTT రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్‌కు మాత్రమే అంకితమైన తొలి OTT ప్లాట్‌ఫామ్‌గా విహారి OTT జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

తెలుగు భాషలో ట్రావెల్‌కు సంబంధించిన కంటెంట్ అనేసరికి జనాల్లో కూడా ఓ ఇంట్రెస్ట్ నెలకొంది. ఇదివరకు యూట్యూబ్ ద్వారా ఇలాంటి కంటెంట్ ఎంజాయ్ చేసిన ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారి కోసం ఈ ఓటీటీ మరింత స్పెషల్ కంటెంట్ అందించనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *