Last Updated:
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158, రుతురాజ్ గైక్వాడ్ 74తో ఒంటరి పోరాటం, మిగతా బ్యాటర్లు విఫలం.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెత్త పెర్ఫామెన్స్ కనబరిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ (11) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 60 బంతుల్లో 74 (6 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. ఉర్విల్ పటేల్ (4), సర్ఫరాజ్ ఖాన్ (0), డెవాల్డ్ బ్రేవిస్ (2), శివమ్ దూబే (22).. ఇలా టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేశారు. ఐతే చివర్లో ఓవర్టన్ 18 (3 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లతో కాసేపు అలరించాడు. కానీ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. ఇక గుజరాత్ బౌలర్లలో రబాడా 3, అర్షద్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుతార్ చెరో వికెట్ పడగొట్టారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













