Samantha: మా ఇంటి బంగారం ట్రైలర్ రివ్యూ.. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి? నాకు ఇవేవీ లేవే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త సినిమా “మా ఇంటి బంగారం”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ ట్రైలర్ లోని హైలైట్స్ చూద్దామా..

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త సినిమా “మా ఇంటి బంగారం”. కెరీర్ పరంగా చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్న సమంతకు ఇది హిట్ కావడం చాలా కీలకం. అదే టార్గెట్ గా కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్, గ్రామీణ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఈ సినిమాతో మరోసారి తన లోని డిఫరెంట్ యాంగిల్ చూపించిందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. 3 నిమిషాల 5 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ వీడియోలో సమంతనే మేజర్ హైలైట్ చేశారు. ప్రతి డైలాగ్ కూడా ఆలోచింపజేసేలా ఉండటమే గాక సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చేలా ఉంది. ఈ ట్రైలర్ లో సమంత చాలా కొత్తగా కూడా కనిపించింది. ఓ వైపు అమాయకపు కోడలిగా, మరోవైపు గూండాలను హడలెత్తించే అండర్‌ వరల్డ్ మహిళగా అదరగొట్టింది. నటనలో పలు వేరియేషన్స్ చూపిస్తూ వావ్ అనిపించింది. మరీ ముఖ్యంగా సమంత లుక్ అయితే అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి? నాకు ఇవేవీ లేవే.. అనే డైలాగ్, నా ప్రాణం అడ్డుపెట్టైనా ..నా ఫ్యామిలీ కి ఏమి కాకుండా చూస్కుంటా అనే డైలాగ్ బాగా హైలైట్ అవుతున్నాయి. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది అనే లైన్ తో మా ఇంటి బంగారం సినిమా తెరకెక్కినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఏదిఏమైనా మా ఇంటి బంగారం ట్రైలర్ మాత్రం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసిందనే చెప్పుకోవాలి.

తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై ఈ సినిమాను సమంతనే నిర్మించగా.. ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సో, చూడాలి మరి సోలోగా సమంత ఏ రేంజ్ హిట్ పడుతుందనేది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *