Last Updated:
క్వాలిఫయర్ 1 పోరుకు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఒక ప్లేయర్ టెన్షన్ పెడుతున్నాడు. లీగ్ దశలో రెచ్చిపోయి పరుగులు చేసే అతడు.. ప్లే ఆఫ్స్‌కు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాడు. అతడెవరో ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026)లో భాగంగా మంగళవారం క్వాలిఫయర్ 1 పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది.
ఈ లీగ్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగు పెట్టింది. అందుకు తగ్గట్లుగానే లీగ్ దశలో రెచ్చిపోయింది. టాప్‌లో నిలిచి ఫైనల్ చేరింది. ఆర్సీబీ బ్యాటర్లు.. బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. అయితే క్వాలిఫయర్ 1 పోరుకు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఒక ప్లేయర్ టెన్షన్ పెడుతున్నాడు. లీగ్ దశలో రెచ్చిపోయి పరుగులు చేసే అతడు.. ప్లే ఆఫ్స్‌కు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాడు. అతడెవరో ఇప్పుడు చూద్దాం.
ఈ సీజన్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 14 మ్యాచ్‌ల్లో 557 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ.. 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 50.63 సగటు, 163.82 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో కోహ్లీ పాత్ర ఎంతో ఉంది. అయితే ఇదే కోహ్లీ ఇప్పుడు ఆర్సీబీని భయపెడుతున్నాడు. అందుకు కారణం ప్లేఆఫ్స్‌లో కోహ్లీ పేలవ రికార్డే.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 17 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే పెద్దగా రాణించలేదు. కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 70* (2011 క్వాలిఫయర్-1, చెన్నైపై). ప్లే ఆఫ్స్‌లో విరాట్ 26.40 సగటు, 121.10 స్ట్రైక్ రేట్‌తో 396 పరుగులు మాత్రమే చేశాడు. ఏకంగా ఐదుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగ్గా.. ఒకసారి డకౌటయ్యాడు.
ఇక ఐదుసార్లు 30 రన్స్‌లోపే పెవిలియన్‌కు చేరాడు. గత సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో 12 పరుగులే చేసి నిరాశ పరిచాడు. ఫైనల్లో 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అయితే ఈసారి మాత్రం కోహ్లీ రెచ్చిపోతాడని అతడి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆర్సీబీ సూపర్ ఫామ్‌లో ఉంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ హడలెత్తిస్తున్నాడు. హేజల్ వుడ్ కూడా చెలరేగితే ఆర్సీబీని ఆపడం కష్టమే.
ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. అహ్మదాబాద్ గ్రౌండ్‌లో రెచ్చిపోయినట్లు ఇతర గ్రౌండ్‌లలో ఆడటం లేదు. అయితే బౌలింగ్ అద్భుతంగా ఉంది. రబడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇక జేసన్ హోల్డర్ ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. క్వాలిఫయర్ 1 పోరు రసవత్తరంగా సాగడం ఖాయ.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













