ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టవల్ రెడ్ కార్పెట్‌పై ఈ సారి భారతీయ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాజస్థాన్‌కు చెందిన నటి, మోడల్ రుచి గర్జార్ తన ప్రత్యేకమైన సాంప్రదాయ లుక్‌తో అంతర్జాతీయ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ రంగు రాజస్థానీ దుస్తులు, వెండి జరీ పనితనం, సంప్రదాయ ఆభరణాలు, గాజులు, పారదర్శక ముసుగుతో ఆమె చేసిన రెడ్ కార్పెట్ వాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాషన్‌తో పాటు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన విధానం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.













