గొల్లపల్లి రిజర్వాయర్‌పై రాజకీయ వేడి.. మెగా రెడ్డి vs నిరంజన్ రెడ్డి మాటల యుద్ధం..! megha reddy niranjan reddy war of words over gollapalli reservoir. | | ACTPnews

గొల్లపల్లి


Last Updated:

గొల్లపల్లి రిజర్వాయర్‌పై వనపర్తిలో రాజకీయ వేడి, ఎమ్మెల్యే మెగా రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు

+

గొల్లపల్లి రిసర్వాయర్ పై ప్రస్తుత పరిస్థితి ఇదే ….

వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్‌పై వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో వనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే Megha Reddy మరియు మాజీ ఎమ్మెల్యే Niranjan Reddy ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. ప్రాజెక్ట్ అవసరం, నిర్ణయాల వెనుక ఉద్దేశ్యాలపై ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పిస్తూ చర్చను మరింత రగిలిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ, కమిషన్లకు అలవాటు పడిన కొందరు రిజర్వాయర్ల పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. గొల్లపల్లి రిజర్వాయర్ కోసం జీవో నెంబర్ 105 తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసని, 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగమైన ఏదుల రిజర్వాయర్ 2800 ఎకరాల్లో నిర్మాణం జరిగిందని, కానీ వనపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందడం లేదని విమర్శించారు. ముందుగా దీనిపై సమాధానం చెప్పాలని, తప్పు జరిగితే అంబేద్కర్ చౌరస్తాలో క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు.

ఇదే అంశంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ, ఏదుల రిజర్వాయర్ ప్రతిపాదనకు ముందే గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన తాము చేశామని తెలిపారు. అయితే ఏదుల రిజర్వాయర్ పూర్తయ్యాక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండో రిజర్వాయర్ అవసరం లేదని భావించి తామే స్వయంగా ఆ ప్రతిపాదనను విరమించుకున్నామని స్పష్టం చేశారు. ఇది రాజకీయ నిర్ణయం కాదు, బాధ్యతతో తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరం లేకుండా ప్రాజెక్టులను బలవంతంగా మోపడం తమ విధానం కాదని అన్నారు. ఇప్పుడు వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మెగా రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

ఇలా గొల్లపల్లి రిజర్వాయర్ అంశం వనపర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, ఈ వివాదం ఎటువైపు మలుపుతీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports