Last Updated:
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్కే తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు మరో హై వోల్టేట్ మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్కే తలపడుతోంది. ఇక టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే సీఎస్కే అభిమానులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని కెప్టెన్ రుతురాజ్ స్పష్టం చేశాడు. ధోనీ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం వల్లే ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని రుతురాజ్ తెలిపాడు. ఈ రోజు తాము గెలుస్తామని, తదుపరి మ్యాచ్‌కు ధోనీ కోలుకుని తిరిగి జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు కెప్టెన్ పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్..– Sanju Samson (WK), Ruturaj Gaikwad (C), Urvil Patel, Kartik Sharma, Dewald Brevis, Shivam Dube, Prashant Veer, Akeal Hosein (In for Gurjapneet Singh), Noor Ahmad, Anshul Kamboj and Spencer Johnson.
సన్ రైజర్స్ హైదరాబాద్.. – Abhishek Sharma, Ishan Kishan (WK), Heinrich Klaasen, Salil Arora, Ravichandran Smaran, Nitish Kumar Reddy, Pat Cummins (C), Shivang Kumar, Eshan Malinga, Sakib Hussain and Praful Hinge.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














