KakaniGovardhanReddy | అమరావతి పేరుతో అప్పుల కుప్ప.. చంద్రబాబుపై కాకాణి నిప్పులు! | ACTPnews

KakaniGovardhanReddy | అమరావతి పేరుతో అప్పుల కుప్ప.. చంద్రబాబుపై కాకాణి నిప్పులు!



అమరావతి రాజధానిని చంద్రబాబు కేవలం తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. “అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామంటూ అసెంబ్లీలో తీర్మానాలు చేయడం ఒక పెద్ద డ్రామా. గతంలో వేల కోట్లు ఖర్చు చేశామన్నారు, మరి ఇప్పుడు మళ్లీ అప్పులు ఎందుకు తెస్తున్నారు?” అని ప్రశ్నించారు. అమరావతిని చంద్రబాబు ఇప్పటికే అప్పులకుప్పగా మార్చారని, గ్రాఫిక్స్తో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని హితవు పలికారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ, కేవలం ఒకే చోట పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports