Last Updated:
సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పోలీసు యంత్రాంగం, అధికారులూ.. సెక్స్ వర్కర్లను గౌరవంగా పరిగణించాలనీ, వారి గోప్యతను కాపాడాలని స్పష్టం చేసింది. ఏ రకమైన రెస్క్యూ ఆపరేషన్‌లోనూ వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదనీ, మీడియాకు లీక్ చేయకూడదని ఆదేశించింది.
మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని ఆదేశించింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదన్న సుప్రీంకోర్టు.. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించవద్దన్ని తెలిపింది.
ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులపై దాడులు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధం అన్న సుప్రీంకోర్టు.. ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉంది అని చెప్పింది. రెస్క్యూ ఆపరేషన్లలో ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయడం నేరం అని సుప్రీంకోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పోలీసు యంత్రాంగం, అధికారులూ.. సెక్స్ వర్కర్లను గౌరవంగా పరిగణించాలనీ, వారి గోప్యతను కాపాడాలని స్పష్టం చేసింది. ఏ రకమైన రెస్క్యూ ఆపరేషన్‌లోనూ వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదనీ, మీడియాకు లీక్ చేయకూడదని ఆదేశించింది. అలా చేస్తే.. ఆ చర్యలను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
సుప్రీంకోర్టు ఈ తీర్పులో బలవంతపు అక్రమ రవాణా నిరోధంపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, అదే సమయంలో స్వచ్ఛందంగా ఈ వృత్తిని ఎంచుకునే వయోజనుల హక్కులను కాపాడాలని చెబుతూ.. సమతుల్య విధానాన్ని నిర్దేశించింది. ఈ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు శాఖలకు సూచించింది. ఇది సెక్స్ వర్కర్ల సమస్యలను మానవీయంగా పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్డేట్లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













