Donald Trump: ఆ హామీ ఇస్తేనే ఒప్పందం.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్! మరి ఇరాన్ ఒప్పుకుంటుందా? | | ACTPnews

News18


Last Updated:

టెహ్రాన్ (ఇరాన్) ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదనే ప్రధాన హామీ లభిస్తేనే ఈ ఒప్పందం కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు.

డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్

Donald Trump: ఇరాన్‌తో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందం వైపు సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే టెహ్రాన్ (ఇరాన్) ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదనే ప్రధాన హామీ లభిస్తేనే ఈ ఒప్పందం కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం ‘ఫాక్స్ న్యూస్’ (Fox News) ప్రతినిధి లారా ట్రంప్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు వేగంగా పురోగమిస్తున్నాయని, అయితే ఇంకా ఎలాంటి తుది ఒప్పందం ఖరారు కాలేదని ట్రంప్ పేర్కొన్నారు. “నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ ఏమిటంటే.. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. అందుకు వారు కూడా అంగీకరించారు” అని ట్రంప్ తెలిపారు.

మంచి ఒప్పందానికి చేరువలో ఉన్నాం.. కానీ తొందరపడం!

ప్రస్తుతం జరుగుతున్న చర్చలపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తూ, సరైన ఫలితం రావాలంటే కొంత ఓపిక అవసరమని అభిప్రాయపడ్డారు. “మేము చాలా మంచి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాము. ఒకవేళ మీరు తొందరపడితే మంచి డీల్ కుదుర్చుకోలేరు. నిదానంగా అయినా సరే, ఖచ్చితంగా మాకు కావలసిన దాన్ని మేము సాధిస్తున్నాము. ఒకవేళ మాకు కావలసింది లభించకపోతే, దీనిని ముగించడానికి మేము వేరే మార్గాన్ని ఎంచుకుంటాము” అని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఘర్షణల నేపథ్యంలో ఈ దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇరాన్ మిలిటరీని కావాలనే వదిలేశాం

ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ నాయకత్వాన్ని, ఇతర సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. ఇరాన్ మిలిటరీని మాత్రం తాము తీవ్రంగా టార్గెట్ చేయకుండా కావాలనే వదిలేశామని చెప్పారు. ఇరాన్ మిలిటరీలోని కొన్ని విభాగాలు కాస్త మితవాద (Moderate) ధోరణితో ఉన్నట్లు అమెరికా భావించడమే దీనికి కారణమని ఆయన వివరించారు.

“వారి నౌకాదళం (Navy) 100% పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వారి వైమానిక దళం (Air force) కూడా 100% ఖాళీ అయిపోయింది. కానీ వారి మిలిటరీని మేము కాస్త వదిలేశాము. ఎందుకంటే వారు కొంతవరకు మితవాదులు అని మేము భావిస్తున్నాము. ఈ మాట వింటే ప్రజలు ఆశ్చర్యపోవచ్చు. కానీ గతంలో జరిగిన యుద్ధాలలో ఒక దేశ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేయడం వల్ల ఘోరమైన తప్పులు జరిగాయి. అంతా తుడిచిపెట్టుకుపోతే ఆ దేశం మళ్లీ కోలుకోవడానికి 40 ఏళ్లు పడుతుంది. ఇరాక్‌లో ఏం జరిగిందో మనం చూశాం” అని ట్రంప్ విశ్లేషించారు.

అమెరికా మీడియాపై తీవ్ర ఆగ్రహం

అమెరికా విజయాలను తక్కువ చేసి చూపుతున్నాయంటూ అక్కడి కొన్ని మీడియా సంస్థలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌కు ఉన్న అతిపెద్ద ఆస్తి అమెరికాలోని ‘ఫేక్ న్యూస్ మీడియా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports