Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘జోకర్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఈ సారైనా హీరోగా హిట్టు కొడతాడా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సుడిగాలి సుధీర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి తెలియని సినీ లవర్ ఉండడు. బుల్లితెరపై జబర్దస్త్ షోతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్.. ఆ తర్వాత హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.

News18
News18

సుడిగాలి సుధీర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి తెలియని సినీ లవర్ ఉండడు. బుల్లితెరపై జబర్దస్త్ షోతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్.. ఆ తర్వాత హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన G.O.A.T సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కాగా.. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుధీర్ జోకర్’.

పీఎస్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్లేయింగ్ కార్స్డ్‌తో సుడిగాలి సుధీర్ లుక్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్‌లో ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే.. మురళి శర్మ, అజయ్ ఘోష్, విష్ణు వంటి స్టార్ నటులను చూపించారు. అంటే ఈ సారి సుధీర్ సాలిడ్ సినిమాతో వస్తున్నాడని తెలుస్తుంది.

బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. అప్పటికే ఎన్నో సినిమాల్లో కీలక రోల్స్‌లో నటించిన సుధీర్.. 3 మంకీస్ సినిమాతో హీరోగా మారాడు. కాకపోతే ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ సుధీర్ అంటూ మరో సినిమా చేశాడు. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది కానీ.. ఇది కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత గాలోడు, కాల్లింగ్ సహస్ర వంటి పలు సినిమాలు చేశాడు కానీ.. ఏవి కూడా సుధీర్ బాబును ఒక సాలిడ్ హీరోగా నిలబెట్టలేకపోతున్నాయి.

నిజానికి బుల్లితెరపై సుధీర్‌కు తిరుగులేని క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ.. సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం ఆ క్రేజ్ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. టీవీల్లో చూసి అలవాటైన సుధీర్.. థియేటర్‌లో మాత్రం జనాలకు అలవాటు కాలేకపోతున్నాడు. అసలు హీరోగా సుధీర్‌ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అయితే సరైన కంటెంట్ పడితే మాత్రం సిల్వర్ స్క్రీన్‌పై కూడా దుమ్మురేపొచ్చు. మరీ ఈ సారైన జోకర్ సినిమాతో హీరోగా నిలబడతాడా లేదా అనేది చూడాలి.

ప్రస్తుతం బుల్లితెరపై మాత్రం సుధీర్ దూసుకుపోతున్నాడు. సర్కార్-3తో పాటు పలు షోలను హెస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. చెప్పాలంటే సుమ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. మొన్నటి వరకు ఎక్కడ చూసిన ప్రదీప్ మాచిరాజు కనిపించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం సుధీర్ కనిపిస్తున్నాడు. మొత్తానికి బుల్లితెరపై రారాజులా ఉంటున్న సుధీర్.. సిల్వర్ స్క్రీన్‌పై హిట్టు కొడతాడా అనేది చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *