డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కత్తిపోటు.. షాకింగ్ ఘటన వెలుగులోకి! | | ACTPnews

Pawan Kalyan: 'ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే'.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కొందరు యువకులు ఓ వృద్ధుడిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన.. శరీరంలో కత్తి దిగిన స్థితిలోనే సాయం కోసం రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ నగరంలోని వల్లభ్ నగర్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల ఘనశ్యామ్ రాయ్ శుక్రవారం రాత్రి భోజనం అనంతరం ఇంటి బయట నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు యువకులు మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని ఆయనను డిమాండ్ చేశారు. అయితే ఘనశ్యామ్ రాయ్ వారి డిమాండ్‌ను తిరస్కరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కొద్దిసేపటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆగ్రహానికి గురైన యువకులు తమ వద్ద ఉన్న కత్తులతో ఘనశ్యామ్ రాయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా నిందితుల్లో ఒకరు కత్తిని ఆయన వెన్ను భాగంలో బలంగా దించారు. అనంతరం కత్తిని బయటకు తీయకుండా అక్కడే వదిలేసి పరారయ్యారు.

తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్నప్పటికీ ఘనశ్యామ్ రాయ్ ధైర్యం కోల్పోలేదు. ప్రాణాలను కాపాడుకోవాలనే ఆతృతతో శరీరంలో కత్తి దిగిన స్థితిలోనే వీధుల్లో నడుచుకుంటూ సహాయం కోసం వెతికారు. ఈ హృదయ విదారక దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. వీడియో చూసిన ప్రజలు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి కత్తిని తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై మోతీనగర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్ ఇన్‌ఛార్జ్ జస్వంత్ రాజ్‌పుత్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, స్థానికుల సమాచారంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం.

నిందితులను కోర్టులో హాజరుపరచడానికి ముందు పోలీసులు వారిని వల్లభ్ నగర్ వీధుల్లో కాలినడకన ఊరేగించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రజలకు, నేరస్తులకు హెచ్చరికగా ఈ చర్య చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నిందితులతో “నేరం చేయడం పాపం” అంటూ నినాదాలు కూడా చేయించారు.

ఈ ఘటనపై స్పందించిన స్టేషన్ ఇన్‌ఛార్జ్ జస్వంత్ రాజ్‌పుత్, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితులపై హత్యాయత్నం సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మైనర్ నిందితులను బాలనేరస్థుల సంరక్షణ కేంద్రానికి తరలించగా, మిగిలిన ఇద్దరిని న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు పంపించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports