ఐదో కారణం చూస్తే.. భారీ తారాగణం. పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, దివ్యాందు శర్మ (మీర్జాపూర్ ఫేమ్), బొమన్ ఇరానీ, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చూస్తే మతిపోతుందట. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్రమైన భావోద్వేగానికి గురిచేస్తాయని, థియేటర్లలో కన్నీళ్లు పెట్టించడం ఖాయమని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ . క్లైమాక్స్ లో వచ్చే 10 నిమిషాల సీన్ ఒకటి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా ఉంటుందని, ఇదే సినిమాకు మేజర్ హైలైట్ అని తెలుస్తోంది. సో ఇది కూడా పెద్ది చూడాలనే కుతూహలానికి మరో కారణం అని చెప్పాలి.













