ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడు ఇంటిపల్లి రామారావు (అలియాస్ శ్రీరామ్)ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె. శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఏటీఎంల వద్ద నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని సహాయం చేస్తానని నమ్మించేవాడు. తన ఫోన్ నుంచి నెఫ్ట్ (NEFT) ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లు నకిలీ మెసేజ్‌లు లేదా స్క్రీన్షాట్లు చూపించి, వారి దగ్గర ఉన్న నగదును తీసుకుని పరారయ్యేవాడు. ఇలా సుల్తాన్ బజార్లో ఒక మహిళను నమ్మించి రూ. 1 లక్ష కాజేశాడు. నిందితుడి బ్యాంకు ఖాతాలోని రూ. 2.40 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేయడమే కాకుండా, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రామారావుపై 2018 నుంచి 2025 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 73 కేసులు నమోదై ఉన్నాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా స్పెషల్ టీమ్ అతడిని కోఠి సమీపంలో పట్టుకుంది.
Source link
ATM Fraudster Arrested | ఏటీఎం మోసగాడు అరెస్ట్! ఫేక్ మెసేజ్‌లతో బురిడీ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు.. ఉదయాస్తమాన సేవలో ప్రత్యేక పూజలు! | | ACTPnews
-

Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా బాక్సర్ల జోరు.. ఒకే రోజు రెండు పసిడి పతకాలు! | క్రీడా వార్తలు | ACTPnews
-

Chain Snatching: తిరుమలలో భక్తురాలి మెడలో బంగారు గొలుసు చోరీ.. గంటల్లోనే నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే..? Tirumala Chain Snatching. | | ACTPnews
-

Lenin OTT Relase Date: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







