Team India T20 Squad: టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. జట్టు నుంచి సూర్యకుమార్‌ ఔట్! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు బీసీసీఐ సరికొత్త టీ20 జట్లను ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసి శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డుతో జట్టులోకి వచ్చాడు.

News18
News18

టీ20 జట్టులో బీసీసీఐ ఊహించని మార్పులు చేసింది. ఈ నెల చివర్లో ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లతో జరగాల్సిన టీ20 సిరీస్‌ కోసం శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఇక ఫామ్‌లో లేని కారణంగా ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి పక్కనపెట్టింది. యువ బ్యాటర్ తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ గా నియమించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నేడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ ఎంపికలో అందరినీ ఆకర్షించిన పేరు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ యువ సంచలనం భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. దీని ద్వారా గతంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డు బద్దలైంది.

ఐపీఎల్ టోర్నీలలో కోల్‌కతా, ఢిల్లీ, పంజాబ్ జట్లను విజయవంతంగా నడిపించిన అనుభవం శ్రేయస్ అయ్యర్‌కు ఉంది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో భారీ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన ఆయన, 2023 డిసెంబర్ తర్వాత మళ్లీ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అడుగుపెడుతున్నారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్‌తో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, రాబోయే ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లోనూ అదే తరహాలో యువతకు పెద్దపీట వేస్తూ ముందడుగు వేసింది.

ఈ పర్యటనల షెడ్యూల్ ప్రకారం జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత జూలై 1 నుండి 11 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ సాగనుంది. ఈ రెండు జట్లలోనూ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి పవర్‌ఫుల్ హిట్టర్లకు చోటు దక్కింది. బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి టీ20 సిరీస్ ఇదే కావడం వల్ల, శ్రేయస్ అయ్యర్ సరికొత్త నాయకత్వంలో యువ భారత్ ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

India squad for Ireland tour 2026

Shreyas Iyer – captain, Tilak Varma – vice captain, Ravi Bishnoi, Abhishek Sharma, Nitish Kumar Reddy, Mohammed Siraj, Sanju Samson, Axar Patel, Harshit Rana, Ishan Kishan, Washington Sundar, Arshdeep Singh, Shivam Dube, Varun Chakaravarthy, Prince Yadav, Vaibhav Sooryavanshi.

India squad for England tour 2026

Shreyas Iyer -captain, Abhishek Sharma, Sanju Samson, Ishan Kishan, Shivam Dube, Tilak Varma – vice captain, Nitish Kumar Reddy, Prince Yadav, Washington

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *