Janhvi Kapoor: వెండితెరపై నేను అలా కనిపిస్తే వాళ్లకు సంతోషం.. అందుకే! వామ్మో, జాన్వీ బోల్డ్ స్టేట్‌మెంట్ చూశారా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Janhvi Kapoor: సిల్వర్ స్క్రీన్‌పై నన్ను అలాగే చూడాలంటున్నారు.. అందుకే! వామ్మో, జాన్వీ బోల్డ్ స్టేట్‌మెంట్ చూశారా?

News18
News18

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో జూన్ 4వ తేదీన ప్రతిష్టాత్మకంగా విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యెందు శర్మ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు.

ప్రీమియర్స్ నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా అద్భుత నటన కనబరిచారని, ఆయనకు జాతీయ అవార్డు ఖాయమని మెగా అభిమానులు కాలర్‌ ఎగరేస్తున్నారు. బాక్సాఫీస్ విజయాన్ని పక్కన పెడితే.. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై నెటిజన్లు, సినీ విమర్శకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో జాన్వీ పాత్రకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం గ్లామర్ షోకే పరిమితం చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“అతిలోక సుందరి శ్రీదేవి బతికుంటే తన కూతురిని ఇలాంటి పాత్రలో నటించనిచ్చేవారు కాదు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీనికి తోడు, తన పాత్రను విమర్శిస్తూ వచ్చిన ఒక నెగటివ్ రివ్యూను జాన్వీ కపూర్ స్వయంగా లైక్ చేయడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. సినిమాలో తనను చూపించిన విధానంపై జాన్వీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉందనడానికి ఇదే నిదర్శనమని అభిమానులు భావిస్తున్నారు.

ఈ వివాదంపై సర్వత్రా విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా తక్షణమే స్పందించారు. స్త్రీలను తాము ఎంతో గౌరవిస్తామని, ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘పెద్ది’ సినిమాలో కొన్ని సీన్ల వల్ల ఎవరైనా అసౌకర్యానికి గురైతే హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని, ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుండి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు.

మరోవైపు, దేవర చిత్రంలోనూ జాన్వీ కపూర్‌ను కేవలం పాటలకే పరిమితం చేశారని, ఇప్పుడు ‘పెద్ది’ లోనూ అదే రిపీట్ అయిందంటూ సౌత్ దర్శకులపై బాలీవుడ్ మీడియా మండిపడుతోంది. ఈ రచ్చ నడుస్తుండగానే, గతంలో జాన్వీ కపూర్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో జాన్వీ మాట్లాడుతూ.. “వెండితెరపై నన్ను ఎలా ప్రెజెంట్ చేయాలనేది పూర్తిగా మేకర్స్ నిర్ణయం. దర్శకుడు లేదా సినిమాటోగ్రాఫర్ కెమెరా యాంగిల్స్ మితిమీరితే నేను అంగీకరించను. కాకపోతే, భారీ పారితోషికం తీసుకునే నటిగా, నాకున్న గ్లామర్ ఇమేజ్ వల్ల మేకర్స్ ఇచ్చే పాత్రల పరిధికి లోబడే నేను నడుచుకోవాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఈ పాత వీడియో ఆధారంగా, జాన్వీ తప్పు లేదని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం కేవలం డబ్బు కోసమే ఇలాంటి పాత్రలు ఒప్పుకుంటారా అని నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *