సినీ యాక్టర్ల పర్సనల్ లైఫ్‌లో తెర వెనుక ఎంత డ్రామా, కష్టాలు ఉంటాయో చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది స్టార్ హీరోయిన్లు పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టార్డమ్ వచ్చినా, వ్యక్తిగత జీవితాలు మాత్రం విమర్శల పాలయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, లవ్ ఫెయిల్యూర్స్ వల్ల పిల్లల భవిష్యత్తు కోసం వారిని చిన్న వయసులోనే సినీ రంగంలోకి పంపాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. బాలీవుడ్ క్వీన్ రేఖ (Rekha) కెరీర్, జీవితం అలాంటిదే. తన తల్లి కష్టాలే రేఖను స్టార్‌గా మలిచాయి. ఆమె తల్లి పుష్పవల్లి (Pushpavalli), ఇద్దరు ఆడపిల్లల సింగిల్ మదర్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.













