Breaking News Updates: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది | | ACTPnews

Breaking News Updates: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది |


నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి సమావేశంలో ముందుగా అభినందనలు తెలిపాడు

 

సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్ద కాలంగా భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసింది.
• మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్ ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు వచ్చాయి.
• సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి.
• భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించింది.
• ప్రధాని మోదీ రూపకల్పన చేసిన వికసిత్ భారత్ 2047కు ఏపీ కూడా స్వర్ణాంధ్ర విజన్‌ను అనుసంధానం చేశాం.
• అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా స్వర్ణాంధ్ర @2047 విజన్ రూపకల్పన జరిగింది.
• పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీటి- ఇంధన భద్రత, అగ్రి-టెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్-టెక్ లాంటి 10 సూత్రాలను భాగం చేశాం
• ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకేతికత, పారదర్శక డేటా డ్రివెన్ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports