Last Updated:
ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్.. రూ.1.2 కోట్లు వస్తాయన్న ఆశ.. చివరకు 17 ఏళ్ల బాలుడి దారుణ హత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? రేహాన్‌ను రూ.100 ఆశ చూపించి ఎక్కడికి తీసుకెళ్లారు? రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసే వ్యక్తి నిజంగానే ఉన్నాడా?
ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసులో బయటపడుతున్న వివరాలు పోలీసులనే విస్తుపోయేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను నమ్మిన కొందరు యువకులు, మైనర్లు.. ఓ టీనేజర్ శరీర భాగాన్ని కోట్ల రూపాయలకు విక్రయించవచ్చని భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ తప్పుడు ప్రచారం చివరకు 17 ఏళ్ల రేహాన్ ప్రాణాలను బలిగొంది. అసలు రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసే వ్యక్తి ఉన్నాడా? ఈ వదంతి ఎక్కడి నుంచి వచ్చింది? దర్యాప్తులో పోలీసులు గుర్తించిన సంచలన విషయాలివి.














