Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో కొత్త పార్టీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరుమల సాక్షిగా సంచలన నిర్ణయం.. ఇక ఏపీ పాలిటిక్స్‌లో అసలైన గేమ్ షురూ!

+

News18

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం త్వరలో కీలక మలుపు తిరగబోతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల నడుమ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుట్టేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. బుధవారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. పూర్తిగా ప్రజాపక్షంగా నిలబడే లక్ష్యంతో అతి త్వరలో నూతన రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆయన మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు, వారి వాణిని బలంగా వినిపించేందుకు ఒక బలమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports