Last Updated: Jun 11, 2026, 17:03 IST
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 2,200 మంది, 2025లో 2,400 మంది చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని, మహిళా వింగ్ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల మహిళల రక్షణపై దృష్టి పెట్టలేకపోతున్నారని విమర్శించారు.












