ఈసారి టోర్నీ పరిధిని 32 జట్ల నుండి 48 జట్లకు విస్తరించడం వల్ల చిన్న, అభివృద్ధి చెందుతున్న ఫుట్బాల్ దేశాలకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. టోర్నీకి అర్హత సాధించి గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగే జట్లకు కూడా కనీసం $9 మిలియన్ డాలర్లు లభిస్తాయి. దీనికి తోడు, టోర్నీ సన్నాహకాల కోసం ఫిఫా ప్రతి జట్టుకు అదనంగా $1.5 మిలియన్ డాలర్లు (రూ. 12.5 కోట్లు) కేటాయించింది. అంటే, ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా, ప్రతి క్వాలిఫైడ్ దేశం కనీసంగా $10.5 మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 87.5 కోట్లు) తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం.













