Salman Khan: సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘కాలా హిరణ్: బ్యాటిల్ ఫర్ లెగసీ’ సినిమా నిర్మాణం, ప్రచారం, విడుదలపై తక్షణమే స్టే విధించాలని కోరుతూ సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

News18
News18

‘కాలా హిరణ్: బ్యాటిల్ ఫర్ లెగసీ’ సినిమా నిర్మాణం, ప్రచారం, విడుదలపై తక్షణమే స్టే విధించాలని కోరుతూ సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 1998 నాటి కృష్ణజింకల కేసు స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆ నటుడు ఆరోపించారు. “కాలా హిరన్ – ది బ్యాటిల్ ఫర్ లెగసీ” (Kala Hiran – The Battle for Legacy) విడుదలను అడ్డుకోవాలని ఆయన కోర్టులో అత్యవసర మధ్యంతర నిరోధక ఉత్తర్వుల (Interim Injunction) అప్లికేషన్‌ను దాఖలు చేశారు.

ఈ చిత్ర ప్రాజెక్ట్, ప్రమోషనల్ మెటీరియల్స్ తన పబ్లిక్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా కథాంశం మొత్తం సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన ప్రసిద్ధ ‘కృష్ణజింక కేసు’ (Blackbuck Case) ఆధారంగా రూపొందించబడిందని, దీనివల్ల ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన విచారణల ప్రక్రియ ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని సల్మాన్ తరపు న్యాయవాదులు వాదించారు.

అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత జీవిత విశేషాలను సినిమాగా మలచడం వారి హక్కులకు భంగం కలిగించడమేనని పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద చిత్రంపై తక్షణమే స్టే విధించాలని సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును గట్టిగా అభ్యర్థించారు. ఈ పరిణామం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

గత నెలలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనంతరం దీనిపై మేకర్స్ మాట్లాడుతూ.. 1998లో జోధ్‌పూర్‌లోని కకానీ గ్రామంలో జరిగిన కృష్ణ జింక వేట కేసు, నడిచిన కోర్టు డ్రామా, అదేవిధంగా సల్మాన్ ఖాన్‌కు, లారెన్స్ బిష్ణోయ్‌కు మధ్య నెలకొన్న తీవ్రమైన వైరాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం అని తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed