Vijay Meets Governor: నేనే సీఎం.. గవర్నర్ని కలిసిన విజయ్ | ACTPnews

Vijay Meets Governor: నేనే సీఎం.. గవర్నర్ని కలిసిన విజయ్



తమిళనాడు రాజకీయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. టీవీకే (TVK) అధినేత విజయ్ బుధవారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. తన పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్రులు, మిత్రపక్షాలైన కాంగ్రెస్ (5 సీట్లు) కలిపి మొత్తం 112 మంది (మరికొంత మంది మద్దతుతో సహా) ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. ద్రావిడ రాజకీయాలకు చెక్ పెడుతూ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. గురువారం (మే 7) చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports