Kavitha Demands : ఖమ్మం బాలికను పరామర్శించిన కవిత! | ACTPnews

Kavitha Demands : ఖమ్మం బాలికను పరామర్శించిన కవిత!



హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బాధితురాలైన బాలికను బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి దారుణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే ఉరితీయాలని, బాధిత బాలికకు నెలకు రూ.50 వేల పింఛన్ తో పాటు ఆమె తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *